దీపావళికి జాంకో witchcraft.

Tuesday, October 28, 2008


అసలు దీన్ని The Inquisistor - సత్యాన్వేషి లో వ్రాయ వచ్చు. (గీతా స్పోర్ట్స్ క్రింద). కానీ జాంకోవిచ్ గురించి ఇక్కడపెట్టాల్సిందే అని అనిపించింది. హేమా హెమీ లని మించి తను ఈసారి సంవత్సరాంతం వరకూ number one గానే ఉంటోంది. అదీ ఒక్క గ్రాండ్ స్లాం రాకుండానే. అంటే ఎంత నిలకడైన ఆట తీరుని కనపరచిందో కదా!


అందుకే తనని "వింబుల్డన్ విలేజ్" లోకి సగౌరవం గా ఆహ్వానిస్తున్నాను. ఒక గెస్ట్ గా. తను ఈ వూళ్ళో అమ్మాయి గా ఇంకా గుర్తింపు పొందలేదు. ఇక్కడ పౌరసత్వం రావాలంటే వింబుల్డన్ గెలవాల్సిందే!


హ్యాట్స్ ఆఫ్! Jelena Jankovic.


ఇక విలియమ్స్ లు number one కాలేక పోయినా తమ పూర్వ వైభవాన్ని చాటారు. (వారి గురించి ప్రత్యెక వ్యాసం రెడీ అవుతోంది).


FedEx, గడ్డు కాలాన్ని ఎదుర్కున్నా మళ్ళీ Swiss indoor tourny గెలిచి సత్తా చాటాడు.


నేను చెప్పినట్టుగానే రాఫా ఈ సంవత్సరానికి number one.


ముర్రే ఎదుగుతున్నాడు. అందుకే రాబోయే సంవత్సరం ఆసక్తి కరం గా సాగే అవకాశం ఉంది.


సానియా అడ్రెస్స్ లేక పోవటం దీపావళి ధమాకా!


దీపావళి శుభాకాంక్షలు.

గీతాచార్య.

Read more...

ఇంద్రధనస్సు - The Rainbow

Wednesday, October 15, 2008

"CHAMPIONS ARE COLORFUL"

Andre Agassi... ఆ పేరు వింటేనే ఒళ్ళు పులకరిస్తుంది.

ఇంద్ర ధనస్సులో ఏడు రంగులుంటాయి.

ఏడు రంగులనూ కలిపితే నే మనకు తెలుపు రంగు వస్తుంది. అంటే తెలుపులోనే ఏడు రంగులూ ఉంటాయి.

అందుకే "వింబుల్డన్" లో తెల్లని దుస్తులనే వాడాలని నియమం పెట్టి ఉంటారు. Agassi Black and White photo ఇది. అయినా ఎంత Colorful గా ఉన్నాడో చూడండి.

ఇప్పుడు రంగు రంగుల దుస్తుల్లో. ఆ glamor వేరు. అందుకే అతనంటే అప్పట్లో అమ్మాయిలకి ఆరాధన. సిసలైన యువకుడు.

అందుకే నన్నాకర్శించాడు తోలి చూపులోనే. అలా మైకేల్ స్టిచ్ తరువాత నాకు నచ్చిన మరో స్టార్. నిజమైన స్టార్. ఎందుకంటే తళుక్కున మెరుస్తాడు కదా!

1991 Photo అనుకుంటాను.




Practice చేస్తూ. ఆ ఎర్ర రంగు జుట్టూ, చింపిరి గడ్డం. ఇవి చాలవూ ఒక పిల్లవాడి మనస్సు ని కొల్ల గొట్టటానికి?

అందుకే "Champions are colorful." అలా ఉంటేనే అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. అందులోనూ చిన్న పిల్లలని.



Bad boy Agassi. ఆఆ నల్ల కళ్ళజోడూ... పొడుగు జుట్టూ... చెవి పోగూ... ఒక నిజమైన Fashion icon.
ఆ backhand కొట్టే stylke చూడండీ. Glamor magic.

నా మనసు కొల్లగొట్టింది ఇప్పుడే...
1992 Wimbledon Trophy తో.
తెల్ల బట్టల్లో ఇంద్రధనస్సు.
అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా! దశాబ్ద కాలం లో ఏమైనా జరగొచ్చు.
ఆటలో పదను ఏమాత్రం తగ్గలేదు. Pegion Toes Agassi.

అపుడెపుడో చిన్నప్పుడు.
విషాదం లో నవ యువకుడు. ఏడుపులోనూ ఉందోయ్ glamor.

గుండునే Fashion చేసిన మొనగాడు.
అందం చెక్కు చెదరలేదు సరి కదా అందరూ గుండె మందనుకున్నారు.
వంద మిలియన్ డాలర్ల నవ్వుల్ నవ్వుల్.


అగస్సి గురించి మరో బ్లాగ్ లో ఇంకా... ఇంకా...
అప్పటి దాకా...సెలవ్!
వింబుల్డన్ సామెత: "గ్లామరున్నోడు ఎన్ని డ్రెస్సులు అయినా వేయొచ్చు."
నెక్స్ట్ పోస్ట్ ఈజ్ "అందరికీ వైరల్ ఫీవెర్... నాకు అగస్సీ ఫీవెర్!"
మన పంథా: "Winning is a fashion. Victory is a passion."

Read more...

గెలిచే వాడే మనిషి - 2

Thursday, October 9, 2008

అబ్బ! ఈ పేరు గురించైతే ఈ మధ్యనే నాకు గంటసేపు తలంటి పోయటం జరిగింది. అదెలాగో మీకు త్వరలోనే తెలియవచ్చు. కానీ నేనే గెలిచాను. :-)) హ హ హ.  

సరే విషయానికి వద్దాం. ఎక్కడ ముగించాం? అంతే దెబ్బకు నేను మైకేల్ స్టిచ్ కి అభిమానిని అయిపోయాను. ఎక్కడికెళ్ళినా నేను స్టిచ్ మంత్రమే. ఐతే అది కొంత కాలమే! తరువాత మనకి 'మహాకాళాన్ని మట్టుపెట్టిన ఇవాన్' దొరికాడు. వాడు టెన్నిస్ ఆటగాడు కాదు. (ఆ స్టోరీ వేరే చెప్తాను). కానీ నా మీద మైకేల్ స్టిచ్ వేసిన ఎఫ్ఫెక్ట్ అంతా ఇంతా కాదు. ఎక్కడో ఔట్ సైదర్ అయిన తను బెకేర్ అంతటి మొనగాడి మీద గెలవటం? గ్రేట్. ఎన్ని గట్స్ ఉండాలి? అందులోనూ మూడే మూడు సెట్ లలో గెలవటం?  

నేను బడికి (కొత్త బడి. నేను పది క్లాసులని ఏడు బళ్ళలో చదివాను. బళ్లంటే ఎద్దు బండీలు కాదు. ఇస్కూలు బడి అన్న మాట. సారీ తమ్ముడి మాట.) వెళ్ళగానే శర్మా మాస్టరు మీ నాన్న గారి పరువు నిలబెట్టాలంటే మొదటి రాంకు రావాలని వార్నింగ్ ఇచ్చాడు. నాకేమో ఆయనంటే చచ్చేంత భయం. అస్సదురు మొదటి పిల్ల ఎవరా? (ఖచ్చితంగా నాకు అమ్మాయిలకే మొదటి రాంకు వస్తుందని నమ్మకం. ఎందుకంటే ఆ రాంకు విషయం లో అమ్మాయిలతోనే ఎక్కువ పోటీ పడింది) అని వెతుకులాట మొదలెట్టాను. అబ్బాగా చదివే అమ్మాయి పేరు ఐశ్వర్య అని కర్తవ్యం విజయశాంతి లెవెల్లో నాకు సుబ్రహ్మణ్యం సారు (శర్మ గారి అన్నయ్య) చెప్పారు. మొదటి రాంకు రాకుంటే తాట తీస్తానన్న శర్మా మాస్టరు వార్నింగు, సుబ్రహ్మణ్యం గారి కర్తవ్య బోధనా కలిసి నన్ను ఇరకాటంలో పడేశాయి. ఇంతలో చిన్నమామయ్య పెళ్లి కావడంతో వెళ్లి వచ్చాను. అదో పది రోజులు రక్షించింది. 

ఈ గొడవ ఎట్టా తీరునా అనుకుంటుంటే ఇదో ఇలా స్టిచ్చి అనగా కొండ చిలివ గెలిచాడు. వాడేదో నెంబరు వానను ఆటగాడనుకుంటే... బెకేర్ కి ఉన్న చరిత్ర లేదని నాన్న చెప్పాడు. అద్గదీ అప్పుడే నాకూ ఒక ధైర్యం వచ్చింది. బెకేర్ లాంటి ఆటగాడినే స్టిచ్చి ఓడించగా లేంది మనకప్ఫలానా కర్తవ్యం ఐశ్వర్య ఒక లెక్కా అనుకుంటూ బరిలోకి దూకాం. చూశారా చిన్న వయసులోనే గెలుపంటే ఎంత ప్యాషనో! ఎవరికుండదు చెప్పండి? 

"When odds are against you, you have to prove yourself to others. But when the odds are in favor of you, you have to prove only to yourself. But I don't prove to others. Because I never felt yhe odds are against me." - Pete Sampras.  

వింబుల్డన్ సినిమా టైటిల్: గెలుపు - దీనికి రుచెక్కువ.  

మరో విషయం. ఇదే కాదు. చాలా ఉదంతాలు చెప్పాలి. మొన్నీ మధ్య యూఎస్ ఓపెన్ గెలిచే రోజుల్లో FedEx మొహం చూశారా? ఒక రకమైన కసి. ప్రతి పాయింట్ నూ కొండని పిండి చేసేటంత కసి తో ఆడాడు. ఎందుకు? పాపం ఈ సంవత్సరం మొదట్లో ఉదార సంబంధమైన వ్యాధితో తను బాధ పడ్డాడు. గత సీజన్ ధాటికి అలిసిపోయాడు. మూడోసారి ఫ్రెంచ్ మిస్సయే సరికి కొంచం డీలా పడ్డాడు. దానికి తోడు వింబుల్డన్లో రాఫా ఐదు సెట్లకి స్ట్రెచ్ చేయటం తనకు కొంచం ఇబ్బంది పెట్టే విషయం. మళ్ళీ యూఎస్ లో జొకోవిక్ స్కోరు చూస్తె తేలిక గానే ఓడినా, తనని కంగారు పెట్టాడు. 

అందుకే ఈసారి తను అలసటగా సీజాన్ని మొదలెట్టాడు. అంతే మన విమర్శకులకి మేత దొరికింది. వీళ్ళకి పనేమీ ఉండదు.  

వింబుల్డన్ సినిమా టైటిల్: విమర్శకులు - వీళ్ళకి మేత కావాలి.  

ఎలాగెలగా? ఫెదెరెరు ఆట్టం లేదు. ఇక ఇతని పని అయిపోయింది. దీనికితోడు జొకోవిక్ Australian Open గెలవటం తోనే ఇక ఇతనే నెంబరు వన్ను అన్నారు. మధ్యలో రాఫా ఉన్నాడనే సంగతి మర్చిపోయి. "ఇక నేనే నెంబరు వన్ను. కురుక్షేత్రమే ఎదురైతే.... మోసగాళ్ళకు మొసగాణ్ణీ రా" అంటూ వచ్చిన "నానీ" సినేమా గతే జొకోవిక్ కీ పట్టింది. రాఫా రెచ్చి పోయి నెంబరు వన్ను నేనే అని చెప్పలేదు, అయి చూపిస్తే... ఇక FedEx విషయానికి వద్దాం. ముందు Australian Open తర్వాత కొంత ఫాం కోల్పోయాడనేది నిజమే. జనానికి కావాల్సింది అదేగా. (నాక్కావాల్సిందీ అదే. విషయం తరువాత టపాల్లో వస్తుంది). అంత మాత్రాన అతని పనైపోయినట్లేనా? 

కొంత కాలం గడిచింది. విమర్శల జడివానలో తడిసి ముద్దయ్యినందువల్ల పడిశం పట్టిందో, లేక నిజంగానే అలసి పోయాడో ఏమో కానీ FedEx కొంచం డీలా పడ్డాడు. పైకి కాదు. దాంతో ఫ్రెంచ్ లో ఆటను ఆడాడు అదీ పెద్ద తేడాతో. మేత గాళ్ళకి ఇక టైము వచ్చింది. ఫెదరర్ శకం ముగిసినట్టేనా? అని ఊహాగానాలు మొదలెట్టారు. అందరి గొంతులూ బాగోవుగా! అందుకే పాటలు అంత హిట్ కాలేదు. అయినా వాళ్లు పాడిందే పాత్రా... అన్న చందాన రెచ్చి పోతూనే ఉన్నారు. వింబుల్డన్ లో ఓడగానే ఇక బహిరంగంగానే కచ్చేరీలు మొదలెట్టారు. దుబాయి స్టేజ్ షోలూ వగైరా వగైరాలూ.  

వింబుల్డన్ సామెత: చాంపియన్లు నడుస్తుంటే విమర్శకులు మొరిగినట్టు.  

ఒలింపిక్స్ లో పేస్ ని ఓడించి డబుల్స్ గెలవడమే కాదు. కావాలంటే ఏదయినా నేను చేయగలనని తనకు తానూ నిరూపించుకున్నాడు FedEx . చామ్పియన్లకి ఎవరికో నిరూపించుకునే పని ఉండదు. కేవలం తమకు మాత్రమె బాధ్యులు. ఈ విషయాన్ని సాంప్రాస్ బాగా చెప్పాడు. ఆ నమ్మకంతోనే యూఎస్ ఓపెన్ లో రెచ్చి పోయి ఆడాడు. ఆ కసి గురించి Olympic Tennis - 2 లో చెపుతాను. గెలిచేవాడే మనిషి ఇక్కడికి పూర్తయింది. నా ఈ టైటిల్ గురించి ప్రశ్నించిన రొమాంటిక్ కామెడీ హీరోయిన్ గారికి టైటిల్ ఎందుకు పెట్టానో అర్ధం అయి ఉంటుంది.  

మన పంథా: Winning is a fashion. Victory is my passion.


కొస మెరుపు: నాకు స్టిచ్చి ఇన్స్పిరేషన్ తో మొదటి రాంకు వచ్చింది. ఆ మర్నాడే కుమారి పిన్ని నాకు ఆడ పిల్ల వేషం వేసి ఫోటో తీయించింది. చూశారా విధి ఎంత బలీయ మైనదో!

Next post is 'Champions are colorful'.

Read more...

శిఖరం

Thursday, September 18, 2008

OLYMPIC TENNIS





"Be formless... shapeless, like water. If you put water into a cup, it becomes the cup. You put water into a bottle; it becomes the bottle. You put it into a teapot; it becomes the teapot. Water can flow, and it can crash. Be water, my friend..." ----- Bruce Lee.


ఒలింపిక్స్ లో చైనా తన సత్తా చాటింది. ఎట్టకేలకు తను కోరుకున్న శిఖరాన్ని అధిరోహించింది. అమెరికాని పడగొట్టి, తన ప్రతాపాన్ని ప్రపంచానికి రుచి చూపించింది. చిత్రం అమెరికా పతకాలూ స్వర్ణాలూ గతంలోకన్నా ఏమీ తగ్గలేదు. మనిషి పర్వతాన్ని అధిరోహిస్తాడు కానీ పర్వతం సైజుని తగ్గించలేడుగా...


ఒక విజేతగా నా "వింబుల్డన్ విలేజ్" లో టెన్నిస్ కన్నా ముందు తన గురించి చెప్పించుకుంది. చిత్రమెంతో తెలుసా! చైనా లో మన 'సై'నా తన పట్టుదలని చూపి క్వార్టర్స్ దాకా వెళ్ళింది.


హిమాలయ శిఖరం ఉంది. ఉపయోగం? దాన్ని ఎక్కిన మనిషి ఉన్నాడు. మరి?


శిఖరాలూ, సముద్రాలూ, నక్షత్రాలూ, ఆకాశాలూ, సింహాలూ చాలా ఉంటాయి. అయితే వాటిలో గొప్పతనం ఏదీ లేదు. హిమాలయాల్ని జయించిన మనిషి గొప్ప. టెన్జింగ్ నార్గే, Edmund Hillary EVEREST ఎక్కిన మొనగాళ్ళు.


సముద్రం సవాల్ విసిరితే మనిషి ఓడని తయారు చేశాడు. నక్షత్రాలకే Limit పెట్టాడు మానవుడు (Chandrasekhar Limit). ఆకాశం అంచుల్లో విహరిస్తూ అద్దానిని లొంగదీయాలనే ప్రయత్నం చేసే మనిషికి ఒక పర్వతం, పేరు Alps* అట. సవాల్ విసిరింది. పచ్చిక బయళ్ళలో తనకు తిరుగు లేదని. కానీ Alps ఉండటం గొప్ప కాదు. దాన్నెక్కే Bull* ఉండటం...


అదే జరింగింది మొన్నటి వింబుల్డన్లో. Federer ని జయించిన Nadal మానవ సామర్ధ్యానికి Limit లేదని చాటాడు.


వింబుల్డన్ సామెత: "మానవుడే మహనీయుడు."


వింబుల్డన్ లో Federer ని ఓడించిన Nadal ఒలింపిక్స్ లోనూ తన ప్రతాపాన్ని చూపెట్టాడు. సింగిల్స్ లో స్వర్ణం గెలవటం కాదు. సగర్వంగా తానే ప్రస్తుత టెన్నిస్ లోకంలో Number One అని చెప్పలేదు. చూపెట్టాడు.
ఆహా! Bull Alps ఎక్కింది. మరి Alps మాత్రం తక్కువా... తనని గెలిచిన Bull కి తన సౌందర్యాన్ని, తన చుట్టూ ఉన్నా అందాలనీ చూపించి, సంతృప్తిగా నవ్వుకుంది. ఎందుకో తెలుసా! Federer తన సామర్ధ్యానికి పరీక్ష పెట్టిన ఆ Bull ని ఆహ్వానించినా ఎప్పటికైనా అది దిగి పోవాల్సిందే అని తెలుసు కాబట్టే మౌనం గా చిరునవ్వు చిందిస్తూ ఉండిపోయాడు.


Bull కి దిగకా తప్పలేదూ, Alps తన అందాలని మరింత పెంచుకుని ఆ మనిషికి ఆనందం ఇవ్వకా పోలేదు.


Federer, the greatest of the Twenty-first century Tennis players, is not finished yet. If he was deprived of the Singles gold, He showed he can win the Doubles gold.


వింబుల్డన్ సామెత: "విజేత చేజారిన అవకాశాలని తలుస్తూ కృంగి పోడు. లేని అవకాశాలని సృష్టించుకుంటాడు."


Roger Federer - His Royal Highness - in the words of Nirmal Sekhar, is still a force to reckon with.


తక్కువ అంచనా వేయరాదు. "ఎర్ర డ్రెస్ లో సెరెనా" అంటూ నేను వ్రాసిన టపాలో ఈ సారి US Open విజేత ఎవరన్న పరోక్ష ప్రశ్నకి వచ్చిన సమాధానాలు మొత్తం ఏడు. నాతో కలిపి. పూర్ణిమ గారు, ప్రియ గారు - Federer గెలుస్తాడనీ, నేనూ, ధనరాజ్, సృజన గార్లూ కలిపి చెప్పింది Nadal. KRK, వైష్ణవి గార్లు చెప్పింది Novak Djokovic.


And finally the winner is FedEX.


చివరగా... "Alps ని Bull ఎక్కితే, బుల్ కి Alps తన అందాలని చూపెట్టింది."


(సశేషం)


Note: చెప్పాల్సింది చాలానే ఉంది. మనసు మనసులో లేదిప్పుడు. విజేతల గురించి తలిస్తే కొంచం హుషారోస్తుందని బ్లాగాను. అసలు నేను షెడ్యూల్ చేసుకుంది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదికి. వ్రాసినంత వరకూ బాగానే వచ్చింది. ఇక చెడ కొట్టకూడదని రాయటానికి ఉన్నా ఆపేశాను.

The next post is "గెలిచేవాడే మనిషి - 2"

మన పంథా: సాహసమే నా ఊపిరి.

* Adopted from the post written by Purnima garu.
The link is

http://oohalanni-oosulai.blogspot.com/2008/07/alps-vs-bull.html

Read more...

స్టిచ్ వన్ స్లాం వండర్ కాదు.

Sunday, August 31, 2008



మొన్నటి బ్లాగులో స్టిచ్ గురించి చెప్పాను. ఆటను అందరూ అనుకునేట్టు వన్ స్లాం వండర్ కాదు. ఈ అద్భుతమైన షాట్ ని చూడండి.

ఒకవేళ ఇక్కడ కనిపించకపోతే ఈ లింక్ లో చూడొచ్చు. http://in.youtube.com/watch?v=WsL89DmOEj4

Read more...

గెలిచే వాడే మనిషి.

Friday, August 29, 2008



MY FIRST WIMBLEDON HERO


"సాహసం చేయరా డింభకా! రాకుమారి నిను వరిస్తుంది." అని పాతాల భైరవి లో నేపాళ మాంత్రికుడు అంటాడు తోటరాముడు తో. మైకేల్ స్టిచ్ కి ఈ విషయం ఎవరన్నా చెప్పారో లేదో
నాకు తెలీదు. పదిహేడేళ్ళ నాడు వింబుల్డన్ లో పెను సంచలనాన్ని
సృష్టించాడు. సరిగ్గా పై డయలోగే నాకు ఇప్పుడు గుర్తొస్తోంది. ఈ విషయాన్ని
తలుచుకుంటుంటే.


మైకేల్ స్టిచ్ గురించి చెప్పాలంటే...


Michael Stich (born October 18, 1968 in Pinneberg, West Germany) is a
former professional tennis player from Germany. He is best remembered
for winning the men's singles title at Wimbledon in 1991. He also won
the men's doubles titles at both Wimbledon and the Olympic Games, and
was a singles runner-up at the US Open and the French Open.


మాత్రం వివరాలు ఎవరికైనా దొరుకుతాయి. అందుకే నేను చెప్పేది వినండి.

అది 1991 లో ఒక ఆది వారం. మా మురళీబాబు నాకు ఒక Bourne Ultimatum జారీ చేశాడు. నేను ఆ రోజు సాయంత్రం కల్లా టెక్స్ట్ బుక్కులోని తను గుర్తుపెట్టిన లెక్కల్ని చేయక పోతే దెబ్బలు తప్పవని. నేను వరుసగా నాలుగు రోజులు స్కూలుకి వెళ్తూనే ఉన్నాను. మరి తనకి ఏమొచ్చిందో నాకు తెలీదు. కానీ అది ఒక వ్యక్తీ జీవన గమనాన్ని మార్చేస్తుందని ఆయన ఊహించి ఉండడు.

వింబుల్డన్ సామెత: "కరవమంటే బెకేర్ కి కోపం... విడవమంటే స్టిచ్చికి కోపం."

ఆ రోజు నాకింకా గుర్తు. మురళీబాబు దాడి నుంచీ తప్పించుకునేందుకు నాకు అప్పటిదాకా ఏ ఉపాయం తోచలా. అందుకే నేను ఏమి చేయాలా అని తెగ ఆలోచిస్తున్నాను. ఇంతలో నాన్న ఊరినుండీ తిరిగి వచ్చాడు. రాగానే కొంచం కాఫీ త్రాగి టీవీ పెట్టాడు. ఆయన ఏవేవో ఆటలు వస్తే చూస్తాడని నాకు తెలుసు. ఆయన ఆటలని చూస్తున్నప్పుడు ఎవరూ కదిలిన్చరు. కొప్పడుతారని కాదు ఆయనని ఆ కాస్త సమయంలోనైనా విశ్రాంతి గా గడుపుతారని.

అంతే నాకు ఉపాయం తోచింది.

వింబుల్డన్ సామెత: "ఉపాయం తోచని వాడిని వింబుల్డన్ లోనుంచీ తోసేయండి."

నేను ముద్దు గా వెళ్లి నాన్న వళ్ళో కూచున్నాను. ఆయన నవ్వుతూ నన్ను కూచోపెట్టుకున్నారు. ఇంతలో రమా పిన్ని వచ్చి నన్ను ఆయనని తోక్కొద్దు అంది. "ఇదిగో రమాదేవీ! కొంసేపు కూచుంటే ఏమవుతుంది? వాణ్ణి కాసేపలా వదిలేయండి," అన్నాడు. "సరే రాజా మామయ్యా!" అంటూ తను సైలెంట్ గా వెళ్ళిపోయింది.

అప్పుడే బెకెర్ ఒక అద్భుతమైన డైవింగ్ వాలీ కొట్టాడు. నాకు ఇంట్రెస్ట్ అనిపించి, "నాన్నా! ఎవరు?" అన్నాను.

"వాడి పేరు బోరిస్ బెకెర్."

"అంటే కప్పా!"

"కాదు."

అయినా నాకు కప్పే బాగుంది, అలాగే ఫిక్స్ అయ్యాను. ఒకసారి బెకెర్ unforced error చేస్తే నాన్న బెకెర్ అనవసరంగా పోగొట్టుకున్నాడు అని అన్నాడు. మరోసారి వాలీ మిస్ అయితే నేను "కప్పగాడు బెక్ బెక్," అన్నా.

ఇంతలో ఒకండు చూడ చక్కని వాలీ వేశాడు. "నాన్నా! వీడెవడు?" అన్నాను.

"మైకేల్ స్టిచ్."

"అంటే?"

నాన్న కుట్లూ, అల్లికలూ అని ఏమీ చెప్పలేదు. ఇంతలో కుమారి పిన్ని "వాడు కప్ప అయితే, వీడు పాము," అంది. ఏ పాము అని ఆలోచించి "వీడు కొండ చిలువ" అని నామకరణం చేశాను.

చూడండి. మనం ఏమరు పాటు గా ఉన్నప్పుడు ఎక్కడి నుంచో హఠాత్తుగా కొండ చిలువ మన మీద పడి "వివాహ భోజనంబు..." అనుకుంటుంది. అలాగే రోజు మా కప్ప గాడు ... అదే బెకెర్, టైటిల్ నాదే అని ఏమరు పాటు గా ఉన్నట్టున్నాడు.

నేను నామకరణం చేసిన ముహూర్త బలమో ఏమో కానీ, మైకేల్ స్టిచ్ తొలిసెట్ ని 6-4 తో గెలిచాడు. ఇంతలో యాడ్స్ వచ్చాయి. అప్పుడు నాన్న నాకు ఒక రఫ్ పేపెర్ మీద టెన్నిస్ కోర్ట్ బొమ్మ గీసి ఆటని వివరించారు. ఆ పేపెర్ నా దగ్గర ఇప్పటికీ ఉంది. అయితే అన్ని రూల్సూ నాకు తెలియలేదు కానీ స్థూలం గా నాకు ఆట మీద అవగాహన వచ్చింది.


మ్యాచ్ మళ్ళీ మొదలైంది. స్టిచ్ మరో విన్నెర్ బాదాడు. నేను ఆనందంతో గంతులేశాను. ఇంతలో నా పాలిటి విలన్ మురళీబాబు వచ్చాడు. అయితే నా పన్నాగం ఫలించి ఆయన నన్ను, నాన్నని డిస్టర్బ్ చేయలేదు. 7-6 తో స్టిచ్ రెండో సెట్ గెలిచాడు. నా ఆనందానికి అవధులు లేవు. మరి స్టిచ్ నాకు ఎందుకు నచ్చాడో తెలీదు. బహుశః గెలుస్తున్నాడని కాబోలు. అంత చిన్న వయసులోనే "ఎవరికైనా గెలిచే వారే నచ్చుతారు".

ఇంతలో నాకు నిద్ర టైమయింది. నేను మంచమెక్కాను. కానీ నాకు నిద్రలోనూ నా హీరో ఆలోచనలే. మధ్యలో లేచి "నాన్నా! ఎవరు గెలిచారు?" అన్నాను.

"రెండు రౌండ్లు స్టిచ్చే గెలిచాడు. వాడే గెలుస్తాడులే."

తెల్లారింది. పేపెర్ వచ్చింది. నేను అందరికన్నా ముందే లేచి కూచుని అందరికన్నా ముందే పేపెర్ తీసుకుని న్యూస్ చూద్దును కదా... "బెకెర్ బోల్తా". అది ఆంద్ర జ్యోతి.

మన పంథా: "గెలిచే వాడే మనిషి."

Note: నాన్నని డు డు అంటున్నాడు అనుకుంటున్నారా... మా నాన్న నన్ను జీవితంలో ఒకే ఒక్కసారి కొట్టాడు. కారణం... "సత్యమేవ జయతే" లో చెపుతాను. అంతదాకా సెలవ్.

(సశేషం)

NEXT BLOG IS: "OLYMPIC TENNIS".

Read more...

ఎర్ర డ్రెస్ లో సెరెనా

ఇవాళ Tensports లో సెరెనా విలియమ్స్ ని చూశా. ఎర్ర డ్రెస్ లో ఎంత ముద్దొస్తోందో! US Open మొదలైంది. మళ్ళీ నేను వింబుల్డన్ విలేజ్ లో వ్రాయలేదు. రెణ్ణెళ్ళు కావొస్తోంది. అందుకే రేపే వ్రాయాలని డిసైడ్ అయ్యాను. మళ్ళీ కలుద్దాం. మా సిస్టర్స్ సెరెనా, వీనస్ లకి శుభాకాంక్షలతో!

మీరూ చెప్పండి మరి... రాఫా, ఫెదరర్ బాగానే ఆడుతున్నారు. ఈ సారి టైటిల్ ఎవరిదో!

Read more...

విజేతెప్పుడూ నా డల్ - 2.

Wednesday, July 16, 2008


"Use only that which works, and take it from any place you can find it." - Bruce Lee.

Safin కి ఇది తెలీదు. The only thing that works for anybody aspiring success is ... బుర్ర. సఫిన్ కి ఇది లేదు అనుకుంటా. ఎక్కడుందో కూడా తెలీదేమో.

మారత్ సఫిన్: ప్రపంచం లోనే అత్యున్నతమైన ఆట కలిగిన ఆటగాడు. 2000 లో US Open లో సఫిన్ చేతిలో ఓడిన తరువాత పీట్ సాంప్రాస్ చేసిన వ్యాఖ్యలే దానికి నిదర్శనం. "రాబోయే దశాబ్దాన్ని ఇతడే ఎలుతాడు. జనం అంతా ఇతని గురించే మాట్లాడుకుంటారు."

కానీ సాంప్రాస్ వ్యాఖ్యలు మరో విధంగా నిజమయ్యాయి. ఈ దశాబ్దం అంతా ఇతనిదే. ఎందుకంటే బ్రతికే ఉన్నాడుగా! జనం అంటా ఇతనిగురించే మాట్లాడుకుంటారు. కుంటున్నారు కూడా! "పరాజితులని అందరూ మర్చి పోతారు." నా మొదటి బ్లాగులో ఈ మాట వ్రాశాను. కానీ ఎంత పరాజితుడయినా సఫిన్ ని మరిచిపోవటం జరుగదు. అతని ఆట అలాంటిది. ఆ ఫైనల్ లో సఫిన్ ఆడిన తీరులోనే ఆది ఉంటే ఈ దశాబ్దంలో ఆటను కనీసం 15 గ్రాండ్ స్లాంలు గెలిచి ఉండేవాడు. ఫెదెరెర్కి నిజమైన పోటీ అంటే ఏమిటో తెలిసేది. పర్లేదు రాఫా ఉన్నాడుగా. ముక్కోణపు పోటీ అయి ఉండేది. ఇంకొంచం బాగుండేది.

ఈసారి సెమీస్ కి చేరుకుని తనలో సత్తా ఇంకా తగ్గలేదు అని చాటాడు.

వింబుల్డన్ సామెత: "సఫిన్ చేతిలో టెన్నిస్ రాకెట్."

మనసెక్కడో పెట్టి ఆడుతూ, తన తప్పుకి రాకెట్లని విరగ్గోడుతుంటాడు. అందుకే 'నిర్మల్ శేఖర్' సఫిన్ ని 'మ్యాడ్ మ్యాన్' అన్నాడు.

నోవాక్ జొకోవిక్ తో సఫిన్ ఆడిన మూడు సెట్ల ఆట టోర్నీ కే హైలైట్. హాట్స్ ఆఫ్ టు సఫిన్.


రేటింగ్స్: నాదల్ 7 out of 10. ఫెదరర్ 8 out of 10. సఫిన్ 6.75 out of 10.

నాదల్ కి అన్న్యాయం జరగాలా. టోర్నీలో మూడు సెట్లు ఓడిపోవడమే కాకుండా మూడు సెట్లలో ముగియాల్సిన ఫైనల్ ని ఐదు సెట్ల పోరుగా మార్చాడు.

ఫెదరర్ ఫైనల్ వరకూ ఒక్క సెట్ కూడా కోల్పోలేదు. ఆట తీరు అదిరింది. ఫైనల్ లోనూ నాదల్ ని చాలా ఇబ్బంది పెట్టాడు. మనసు పెట్టి ఆడినండుకూ, సఫిన్ ని ఓడించినందుకూ.

safin deserved more but ... Atleast he have stretched Federer.

Riener Shuettler 6 out of 10.

జొకోవిక్ 1.5 out of 10.

వింబుల్డన్ సామెత: "విలియమ్స్ ముందు కుప్పి గెంతులా?"

ఈసారి ఇదే జరిగింది. ఒక్కసారి ఫ్రెంచ్ గెలువగానే అందరికీ ఇవనోవిచ్ పిచ్చి పట్టింది ఈవిడకి తోడూ షరపోవా ఉండనే ఉంది. సఫిన్ చెల్లెలు సఫినా, ఆ విచ్చిలూ ఈ విచ్చిలూ, ఇంకా కొంతమంది కోవాలూ.... విలియమ్స్ గురించి మాట్లాడిన వారు చాలా తక్కువ. నిజానికి 2002 వరకూ ర్యాంకు తో సంబంధం లేకుండా సాంప్రాస్ కి టాప్ సీడ్ ఇచ్చారు. Williams too deserve the same respect atleast in Wimbledon.

వింబుల్డన్ ఫాలోస్ లిటరల్స్:

౧. షరపోవా (పోవా రెండో రౌండ్ లోనే పోయింది.). (షరా మామూలుగా పోవా).

౨. సానియా మీర్జా (మీరుజా ... రెండో రౌండులోనే మీరు జా అంది ఆ అమ్మాయి. నాకిప్పుడు పేరు గుర్తులేదు. But she worth mentioned. తప్పక వ్రాస్తాను.).

Note: ౧. రాజు గారన్నట్టు. ఆటని బేసిక్స్ నుంచీ చెప్పొచ్చు. అవసరాన్ని బట్టీ నేను చెపుతాను. నేను నేర్చుకున్న క్రమంలో. లేకపోతె ఇది వింబుల్డన్ విలేజ్ కాదు. టెన్నిస్ లెసన్స్ ఫోరం అవుతుంది.
౨. విజేతెప్పుడూ నా డల్ - ౩ తరువాత కంటిన్యూ చేయ బడుతుంది.
౩. తరువాత బ్లాగు "My First Wimbledon (Tennis) Hero". ఇందులో కొన్ని బేసిక్స్ వస్తాయి.
౪. షరపోవా మూడు గెలిచినా comparable with the hype and potential, she could have won atleast 6. అందుకనే షరా... పోవా.


మన పంథా: గొప్పవారి నెప్పుడూ తక్కువ అంచనా వేయరాదు. Truth has no path. Truth is living and, therefore, changing - Bruce Lee.

Note: నా ట్రూత్ (సత్యం) గురించి తరువాత చెపుతాను.

Read more...

విజేతెప్పుడూ నా డల్

Sunday, July 13, 2008

ఎంత అందమైన వింబుల్డన్ ఇదీ. అద్భుతమైన టెన్నిస్, అర్హత కలిగిన విజేత, కోరుకున్న రిజల్ట్స్, కనివిందు చేసిన ఆటతీరూ... ఓహ్! వాట్ ఎ టోర్నీ?



ఇల్లు మారే హడావిడిలో ఉన్నా ఈ బ్లాగు గురించే ఆలోచింపచేయగల సత్తా ఈ వింబుల్డన్ సొంతం.


ఈసారి డయలోగ్: "ఎ సర్ఫేస్లో ఆడాము అన్నది ముఖ్యం కాదన్నయ్యా! అడ్జస్ట్ అయ్యామా లేదా?"
రాఫెల్ నాదల్ ఈ సారి ఈ డయలోగ్ కొట్టాడు. ఫెదరర్ దిమ్మ తిరిగేలా చేసిన సందర్భం అది.


"విజేతంటే గెలవడమే కాదు, ఓటమిని అంత తొందరగా అంగీకరించరు కూడా" అని ఫెదరర్ నిరూపించిన సందర్భం ఇది.

మరో వైపు విలియమ్స్ ఆల్ విలియమ్స్ ఫైనల్ తో పాటూ, డబుల్స్ లో కూడా నెగ్గి తమ పూర్వ వైభవాన్ని ప్రదర్శించిన సందర్భం ఇది. అయినా ఈ విషయాన్ని మరుగున పడ వేసింది మటుకూ జన్టిల్మేన్స్ సింగిల్స్ ఫైనల్. అందులో అంత ఏముందీ? నా చిన్నప్పటినుంచీ సింహం పెద్దపులీ తలబడుతుంటే చూడాలని కోరిక. ఒకసారి మా నాన్నని ఈ విషయమే అడిగి, ఏది గెలుస్తుంది అని అడిగాను. అప్పుడు తరువాత చెపుతాను అని ఊరుకున్నారు. ఈ మ్యాచ్ చూసిన తరువాత ఆయన "నీ ప్రశ్న కి ఇదే సమాధానం," అన్నారు. కానీ ఇందులో ఎవరు సింహం, ఎవరు పెద్దపులి అని నాకు సరికొత్త డౌట్ వచ్చింది. కానీ అత్యున్నత స్తాయి టెన్నిస్ ని రుచి చూడాలంటే ఈ మ్యాచ్ తప్పక చూడాల్సిందే.
నాదల్: ఈసారి హీరో నదలే. ఫెదేరెర్ని గత కొంత కాలం గా పీడకలలా వెంటాడుతున్న నాదల్, ఫెదరర్ కళాత్మకమైన ఆటని తన టాప్ స్పిన్ షాట్స్ తో గడగడ లాడించాడు. ఎ సర్ఫేస్ మీదైనా నేను ఆడగలనని నిరూపించుకున్నాడు.
ఫైనల్ కు ముందు కేవలం ఒక సెట్ ని మాత్రమే కోల్పోయిన నాదల్ ఫైనల్ లో మొదటి సెట్ లో తన ప్రతాపాన్ని చూపించాడు. తొందరలోనే బ్రేక్ సాధించినా 47 నిమిషాలపాటూ ఆడాల్సి రావటం ఫెదరర్ లోని పోరాట పటిమకు నిదర్శనం.

ఇక రెండో సెట్ లో నాదల్ ని ఫెదరర్ అదరగొట్టి ఆదిక్యమ్లోకి దూసుకుని పోయాడు. కానీ నాదల్ మరోలా ఆలోచించాడు. ఫెదరర్ నిరుటిలా పుంజుకున్నాడు. తనది కాని సర్ఫేస్ మీద నాదల్ పని అయిపోతున్నది అని అందరూ అనుకుంటుండగానే నాదల్ వింబుల్డన్ దయలోగ్ కొట్టాడు. మాటలతో కాదు. తన ఆటతో. అంటే రెండో సెట్ కూడా నాదల్ వశం.
myaach మొదలైనఅప్పటినుంచీ ఇప్పటి దాకా నేను ఇంట్లో లేను వింబుల్డన్ విలేజ్ మొదటి బ్లాగు "ఎందుకు" వ్రాస్తున్నాను. ఇంతలో వర్షం వచ్చింది. వింబుల్డన్లో కాదు. మా ఊళ్ళో. నేను బ్లాగు రాసి ఇంటికి బయలుదేరే సరికి ఒకటే వాన. అయితే కరంట్ పోలేదు. దాంతో నేను ఫైనల్ కోసం వర్షం లోనే సైకిల్ మీద పరిగెత్తాను. తడిసి ముద్దై నేను ఇంటికి వెళ్ళేసరికి నాన్న "అక్కా వాన" అన్నారు. హ్హు హ్హు హ్హు. నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి బోర్గ్, మెకెన్రో 1980 ఫైనల్ మ్యాచ్ వేస్తున్నారు. మధ్య మధ్య లో అసలు మ్యాచ్ (ఇప్పటి ఫైనల్) లోని ముఖ్య ఘట్టాలని వేసేసరికి "ఎలాంటి ఆటను మిస్ అయ్యాను" అనుకోకుండా ఉండలేక పోయాను.
నేను ఒక సారి అన్నం తిని లేచే సరికి మ్యాచ్ మళ్ళీ మొదలైంది. 6-4, 6-4, 4-5. నాదల్ వైపు నుంచీ స్కోర్ అది. నేను టెన్షన్ తో చూస్తుందా గానే కరంట్ ఆఫ్.
ఫెదరర్: ఫెదరర్ మోములో నవ్వు మాయమైంది. నాదల్ హుషారు గా ఉన్నాడు. నాదల్ మధ్యలో క్రింద పడ్డాడని, తన పని అయిపోయిందని అనుకున్నానని, నాన్న అన్నారు.

విజేతలెప్పుడూ అందరిలా ఆలోచించరు కదా! ఫెదరర్ అట్టాక్ మొదలెట్టాడు. నాదల్ ఆటలో సమస్య ఏమిటంటే తన షాట్లు ఫెదరర్ తో పోలిస్తే ఒకింత స్లో గా ఉంటాయి. బంతులు స్పిన్ అవుతూ వస్తాయి. వింబుల్డన్ గ్రాస్లో బంతికి అంత పట్టు చిక్కదు. ఈలోగా ఫెదరర్ కోర్ట్ కవర్ చేయ గలడు. సరిగ్గా ఈ సూత్రాన్నే ప్రయోగించి నాదల్ మనసులో అనుమానపు బాజాలని నాటాడు. సాధారణం గా వర్షం వల్ల బ్రేక్ వస్తే వెనుక బడిన ఆటగాళ్ళు పున్జుకుంటారు. (2001 లో ఇవానిసెవిచ్ హెన్మన్ ఆట గుర్తుందా? లేక పాయినా పర్లేదు. నేను తరువాత గుర్తు తెప్పిస్తాను). బ్రేక్ సమయంలో నాదల్ తను మరి కాసేపట్లో వింబుల్డన్ ట్రోఫీని పట్టుకున్తానని డిసైడ్ అయ్యి ఉంటాడు. కళ్ళ ముందు కప్ తో తను కనిపించి ఉంటాడు. అదే ఎప్పుడూ ప్రమాదం. పని చేస్తున్నప్పుడు ఫలితం గురించి ఆలోచించ కూడదని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కదా! నాదల్ లో ఒక రకమయిన ఉద్వేగం కలిగింది. రాఫా గాడు వింబుల్డన్ విజేత. అంతే.
"గెలిచామా లేదా అని కాదన్నయ్యా! 100 పెర్సెంట్ ఇచ్చామాలేదా" అంటూ ఫెదరర్ ఆడుకున్నాడు. సెట్ టై బెర్క్ కి దారి తీసింది. టై బ్రేక్ లో నాదల్ పోరాడటానికి ప్రయత్నం చేసినాఫెదరర్ వకాశం ఇవ్వ లేదు. టై బ్రేక్ లో 5-౩ వద్ద పాయింట్ అద్భుతం. ఏస్ తో సెట్ని గెలుచుకున్నాడు.

ఇంట్లో అందరూ నిద్ర పోతున్నారు. నాన్న కూడా. లేట్ అయింది కదా!

నాకు నాదల్ మీద కోపం వచ్చింది. నాలుగో సెట్లో ఫెదరర్ ఊపు ఇంకా పెరిగింది. నడక లో హుషారు కనబడుతున్నది. నాకేమో మండుతున్నది. నేను నాదల్ ని తిట్టుకున్టున్డగానే సెట్ టై బ్రేక్ లోకి వెళ్ళింది. అందులో ఈ సారి నాదల్ ఆధిక్యం 5-2. మళ్ళీ నాదల్ వత్తిడికి గురి అయ్యాడు. రా గాడు వింబుల్డన్ విజేత సీన్ కళ్ళ ముందు మెదిలింది. అంతే. మనకు తెలిసిందేగా.
నేను మ్యాచ్ ని తక్కువ సౌండ్ తో చూస్తున్నాను. అక్కడ నాదల్ సెర్వింగ్ ఫర్ ది మ్యాచ్ అనగానే సౌండ్ కొంచం పెంచాను. ఫెదరర్ అదరి పోయే షాట్. ఇంక నాకు సెంటిమెంట్ పట్టుకుంది. వెంటనే సౌండ్ తగ్గించాను. ఈ సారి మ్యాచ్ పాయింట్. మళ్ళీ సౌండ్ పెంచాను. మళ్ళీ ఫెదరర్ పక్షమే. సౌండ్ డౌన్. మూడోసారీ ఇదే పరిస్థితి. ఏదయితే అది అయిందని సౌండ్ పెంచాను. ఇక పో ఫెదరర్ నభూతో అనే లాంటి బ్యాక్ హ్యాండ్ షాట్ తో సెట్ గెలుచుకున్నాడు. "చచ్చినోడా, వెధవా, ముండా, శుంఠా... అంటూ నాదల్ ని తిట్టుకున్నాను. స్లోర్ ఐదవ సెట్లో 2-2.
మళ్ళీ వర్షం పట్టుకుంది. నేను తట్టుకోలేక టీవీ ఆఫ్ చేసి పడుకున్నాను. నిద్రలో అంతా ఫెదరర్-నాదల్ ఆటే. మంచి మంచ్ పాయింట్ లన్నీ కలలోనే. నేను దొర్లుతున్నాను. "లే చూద్దాం," అంటూ ఫెదరర్ తట్టి పిలిచాడు. కళ్లు తెరిస్తే నాన్న. అప్పుడు టైం 1:37. స్కోర్ ఫైవ్ ఆల్. ఇంక అక్కడ నుంచీ నేనూ నాన్నా ఆ కబుర్లూ, ఈ కబుర్లూ చెప్పుకుంటూ మ్యాచ్ ని చూడటమే. పాత విషయాలు కొత్త విషయాలూ అన్నీ మాటలలోనే. ఇంతలో సెవెనాల్. ఫెదరర్ సర్వ్ ని నాదల్ బ్రేక్ చేసాడు. నేను సౌండ్ పెంచుదామనుకున్నా సెంటిమెంట్ గుర్తు వచ్చి పెంచకుండా మంచానికి అతుక్కు పోయాను. డ్యూస్ దాటి నాదల్ గెలవంగానే చూడాలీ నా మొహం thousand watts.

వింబుల్డన్ సామెత: "ప్రతి ఫెదెరెర్కీ ఒక నాదల్ వస్తాడు."

గతనుభావలనుంచీ నేర్చుకున్న పాఠాలని ఉపయోగించుకున్న నాదల్ గెలిచాడు.

శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు, "कर्मण्ये वाधि कारस्ते माफलेशु कदाचन!" పని చెయ్యటమే మన విధి. ఫలితం భగవానుడే చూసుకుంటాడు.

అందుకే మ్యాచ్ మధ్యలో ఒత్తిడికి గురి అవుతుంటారు, అనుభవం లేని వారు. నాదల్ కి వింబుల్డన్ గెలిచిన అనుభవం లేదు. అందుకే మొదటి మ్యాచ్ పాయింట్ అప్పుడు అలా.

మన పంథా: कर्मण्ये वाधि कारस्ते माफलेशु कदाचन

(సశేషం)

Read more...

ఎందుకు?

Sunday, July 6, 2008

ఈ ప్రపంచంలో రెండు విషయాలే సత్యం. ఒకటి గెలవటం. రెండు ఓడిపోవటం. అంతే. మిగతా అంతా మాయే. ఎందుకంటే విజేతలని అందరూ జ్ఞాపకం ఉంచుకుంటారు. పరాజితులని అందరూ మర్చి పోతారు. అందుకే విజయం శాశ్వతం. విజేతే అమరత్వానికి అర్హుడు. (ఇక్కడ మన హిందూ సిద్ధాంతంలో అమరత్వం గురించికాడు).

నాకు తెలిసి టెన్నిస్ ని నేను పదహారు సంవత్సరాలుగా చూస్తున్నాను.ఈ కాలం లో జరిగిన దాదాపూ అన్ని మ్యాచులనీ (గ్రాండ్ స్లాంస్ ని) చూసాను లేదా వివరాలని ఫాలో అయ్యాను. ఇంత కాలంలో నేను గమనించినది అదే.
1998 వింబుల్డన్లో రన్నెర్-అప్ ఎవరో చెప్పండి. 1994 ఆస్త్రేలియన్ ఓపెన్ లో సాంప్రాస్ చేతిలో ఒడి పాయినది ఎవరో టక్కున చెప్పండి. లేదు మీకు గుర్తు రాదు. మరి ఏడు సార్లు వింబుల్డన్ ని గెలిచినది ఎవరు? గత ఐదు సార్లుగా వింబుల్డన్ ని పురుషులలో గెలిచిన దెవరు? నాలుగేళ్ల గా ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల విజేత ఎవరు? హ హ హ ఎవరైనా చెప్పేస్తారు. ఆటతో పరిచయం లేని వాళ్లు కూడా. ఎందుకంటే ఈ పదిహేను రోజుల నుంచీ పేపర్లలో అందరూ చదువుతున్నదేగా.
ఇది నేను టెన్నిస్ గురించి రాస్తున్న బ్లాగు. It's based on my memory. My emotions, My hero(in)s, my villains, True Champions, The winning stories, How Tennis influenced the course of my life, and the effect of Tennis on my Family in a positive way.
ఇందులో మీరు ఒక పిల్లవాడి ఆలోచనలు చూడ వచ్చు. ఒక టీనేజర్ ఆలోచనలూ, ఎమోషన్లు, విశ్లేషణలూ చదవ వచ్చు. ఆతతో మమేకమైన ఒక యువకడి గురించి తెలుసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే It's about the history of Tennis in the last decade and a half. A ballet of emotions, odes to True Champions, and ఇంకంతే. మీరే చూడండి.
వింబుల్డన్ అంటే ఒక విజేత. ఒక గెలుపు. ఒక కల. ఒక జీవిత పాఠం. అందుకే ముందు ఈ క్రింది వాక్యాలు చదవండి.


During his battle with AIDS, one of his fans asked, "Why does God have to select you for such a bad disease?" Ashe replied, "The world over — 50,000,000 children start playing tennis, 5,000,000 learn to play tennis, 500,000 learn professional tennis, 50,000 come to the circuit, 5,000 reach the Grand Slam, 50 reach Wimbledon, 4 to the semifinals, 2 to the finals. When I was holding a cup, I never asked God 'Why me?' And today in pain I should not be asking God, 'Why me?"

అద్భుతమైన మాటలు కదూ. బంగారాన్ని మాటల రూపంలో తెస్తే ఇలాగే ఉంటుందేమో! ప్రతి చిన్న విషయానికీ దేవుడిని తిట్టుకుంటూ, కష్టం వచ్చిన ప్రతిసారీ ఇంకొకళ్ళని బాధ్యులని చేసే ప్రతి ఒక్కరూ ఆగి విని పాటించాల్సిన మాటలు. ఈ మాటలే ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఒక వ్యక్తిని రక్షించటం నేను చూశాను. ఆశావహ దృక్పథం వైపు మల్లించటం నాకు తెలుసు.

ఆర్థర్ ఆషే, 1975 వింబుల్డన్ విజేత. విజేత చెప్పిన మాటే చెల్లుబాటు అవుతుంది. ఇది హనుమాన్ జంక్షన్ సామెత. (సినిమా లోది).

"Start where you are. Use what you have. Do what you can. Then only you are you. Or you are not you Then there will be nothing to be glorified about you because, your story can be told, but the name won't be yours." ఆర్థర్ ఆషే మాటలివి. వింబుల్డన్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఆయనని స్మరించుకుందాం.

Now, getting started.

ఇది చాలా చిరస్మరణీయమైన టోర్నీ. మారత్ సఫిన్, రాఫెల్ నాదల్, రోజర్ ఫెదరర్ సమకాలీన టెన్నిస్ లో అద్భుతమైన ఆటగాళ్ళు. అందరూ సెమీ ఫైనల్ కి చేరారు. మహిళలలో విలియమ్స్ సిస్టర్స్ సింగిల్స్, డబుల్స్ టైటిల్స్ గెలిచి "Class is permanent, form is temporary." అని నిరూపించారు.

జెంగ్ జీ తన ఆటతీరు తో అందరినీ ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా సానియా మీర్జా పొరపాటున కూడా విలియమ్స్ మీద గెలవలేనని నిరూపించుకుంది. ఇంకో విషయం, "మీరజాల గలదా మన సానియ విమ్బుల్డను నందు రెండో రౌండు." అనిపించుకుంది. ఫెదరర్ లేదా నాదల్ లలో ఎవరు గెలిచినా అది రికార్డే కావటం మరో ముఖ్యాంశం. సఫిన్ వస్తే ఇంకా బాగుండేది. బట్ అత్యుత్తమ ఆటగాళ్లే ఫైనల్ లోకి వచ్చారు.

వింబుల్డన్ సామెత: "ప్రతి ఇవానీసెవిచ్ కీ ఒక వింబుల్డన్ వస్తుంది."

అతను భలే ఆటగాడండీ. అతని నుంచీ మనం సిన్సియర్గా కష్ట పడితే ఎప్పటికైనా విజయం వరిస్తుందని నేర్చుకున్నాన్నేను.

ఇకనేం? వింబుల్డన్ విలేజిలో విహరిద్దాం.

ఇప్పటికి సెలవ్. గురువారం నాడు వింబుల్డన్ విలేజిలో మనకి పార్టీ.

Note: All the stories are based on my memory.

మన పంథా: ధైర్యమే ఆయుధం.

Read more...

వింబుల్డన్ విలేజ్

Friday, July 4, 2008

Will be started soon. ThanQ.

Read more...

About This Blog

"ఈ ప్రపంచంలో రెండు విషయాలే సత్యం. ఒకటి గెలవటం. రెండు ఓడిపోవటం. అంతే. మిగతా అంతా మాయే. ఎందుకంటే విజేతలని అందరూ జ్ఞాపకం ఉంచుకుంటారు. పరాజితులని అందరూ మర్చి పోతారు. అందుకే విజయం శాశ్వతం. విజేతే అమరత్వానికి అర్హుడు."

The stories of such Gr8 Champions is chronicled here

The Player

My photo
You are able to see (any) only one of my numerous sides. And I know I'm rational. So, it's better to trust me, rather than evaluating my actions.

  © Blogger templates Newspaper II by Ourblogtemplates.com 2008

Back to TOP