గెలిచే వాడే మనిషి.

Friday, August 29, 2008



MY FIRST WIMBLEDON HERO


"సాహసం చేయరా డింభకా! రాకుమారి నిను వరిస్తుంది." అని పాతాల భైరవి లో నేపాళ మాంత్రికుడు అంటాడు తోటరాముడు తో. మైకేల్ స్టిచ్ కి ఈ విషయం ఎవరన్నా చెప్పారో లేదో
నాకు తెలీదు. పదిహేడేళ్ళ నాడు వింబుల్డన్ లో పెను సంచలనాన్ని
సృష్టించాడు. సరిగ్గా పై డయలోగే నాకు ఇప్పుడు గుర్తొస్తోంది. ఈ విషయాన్ని
తలుచుకుంటుంటే.


మైకేల్ స్టిచ్ గురించి చెప్పాలంటే...


Michael Stich (born October 18, 1968 in Pinneberg, West Germany) is a
former professional tennis player from Germany. He is best remembered
for winning the men's singles title at Wimbledon in 1991. He also won
the men's doubles titles at both Wimbledon and the Olympic Games, and
was a singles runner-up at the US Open and the French Open.


మాత్రం వివరాలు ఎవరికైనా దొరుకుతాయి. అందుకే నేను చెప్పేది వినండి.

అది 1991 లో ఒక ఆది వారం. మా మురళీబాబు నాకు ఒక Bourne Ultimatum జారీ చేశాడు. నేను ఆ రోజు సాయంత్రం కల్లా టెక్స్ట్ బుక్కులోని తను గుర్తుపెట్టిన లెక్కల్ని చేయక పోతే దెబ్బలు తప్పవని. నేను వరుసగా నాలుగు రోజులు స్కూలుకి వెళ్తూనే ఉన్నాను. మరి తనకి ఏమొచ్చిందో నాకు తెలీదు. కానీ అది ఒక వ్యక్తీ జీవన గమనాన్ని మార్చేస్తుందని ఆయన ఊహించి ఉండడు.

వింబుల్డన్ సామెత: "కరవమంటే బెకేర్ కి కోపం... విడవమంటే స్టిచ్చికి కోపం."

ఆ రోజు నాకింకా గుర్తు. మురళీబాబు దాడి నుంచీ తప్పించుకునేందుకు నాకు అప్పటిదాకా ఏ ఉపాయం తోచలా. అందుకే నేను ఏమి చేయాలా అని తెగ ఆలోచిస్తున్నాను. ఇంతలో నాన్న ఊరినుండీ తిరిగి వచ్చాడు. రాగానే కొంచం కాఫీ త్రాగి టీవీ పెట్టాడు. ఆయన ఏవేవో ఆటలు వస్తే చూస్తాడని నాకు తెలుసు. ఆయన ఆటలని చూస్తున్నప్పుడు ఎవరూ కదిలిన్చరు. కొప్పడుతారని కాదు ఆయనని ఆ కాస్త సమయంలోనైనా విశ్రాంతి గా గడుపుతారని.

అంతే నాకు ఉపాయం తోచింది.

వింబుల్డన్ సామెత: "ఉపాయం తోచని వాడిని వింబుల్డన్ లోనుంచీ తోసేయండి."

నేను ముద్దు గా వెళ్లి నాన్న వళ్ళో కూచున్నాను. ఆయన నవ్వుతూ నన్ను కూచోపెట్టుకున్నారు. ఇంతలో రమా పిన్ని వచ్చి నన్ను ఆయనని తోక్కొద్దు అంది. "ఇదిగో రమాదేవీ! కొంసేపు కూచుంటే ఏమవుతుంది? వాణ్ణి కాసేపలా వదిలేయండి," అన్నాడు. "సరే రాజా మామయ్యా!" అంటూ తను సైలెంట్ గా వెళ్ళిపోయింది.

అప్పుడే బెకెర్ ఒక అద్భుతమైన డైవింగ్ వాలీ కొట్టాడు. నాకు ఇంట్రెస్ట్ అనిపించి, "నాన్నా! ఎవరు?" అన్నాను.

"వాడి పేరు బోరిస్ బెకెర్."

"అంటే కప్పా!"

"కాదు."

అయినా నాకు కప్పే బాగుంది, అలాగే ఫిక్స్ అయ్యాను. ఒకసారి బెకెర్ unforced error చేస్తే నాన్న బెకెర్ అనవసరంగా పోగొట్టుకున్నాడు అని అన్నాడు. మరోసారి వాలీ మిస్ అయితే నేను "కప్పగాడు బెక్ బెక్," అన్నా.

ఇంతలో ఒకండు చూడ చక్కని వాలీ వేశాడు. "నాన్నా! వీడెవడు?" అన్నాను.

"మైకేల్ స్టిచ్."

"అంటే?"

నాన్న కుట్లూ, అల్లికలూ అని ఏమీ చెప్పలేదు. ఇంతలో కుమారి పిన్ని "వాడు కప్ప అయితే, వీడు పాము," అంది. ఏ పాము అని ఆలోచించి "వీడు కొండ చిలువ" అని నామకరణం చేశాను.

చూడండి. మనం ఏమరు పాటు గా ఉన్నప్పుడు ఎక్కడి నుంచో హఠాత్తుగా కొండ చిలువ మన మీద పడి "వివాహ భోజనంబు..." అనుకుంటుంది. అలాగే రోజు మా కప్ప గాడు ... అదే బెకెర్, టైటిల్ నాదే అని ఏమరు పాటు గా ఉన్నట్టున్నాడు.

నేను నామకరణం చేసిన ముహూర్త బలమో ఏమో కానీ, మైకేల్ స్టిచ్ తొలిసెట్ ని 6-4 తో గెలిచాడు. ఇంతలో యాడ్స్ వచ్చాయి. అప్పుడు నాన్న నాకు ఒక రఫ్ పేపెర్ మీద టెన్నిస్ కోర్ట్ బొమ్మ గీసి ఆటని వివరించారు. ఆ పేపెర్ నా దగ్గర ఇప్పటికీ ఉంది. అయితే అన్ని రూల్సూ నాకు తెలియలేదు కానీ స్థూలం గా నాకు ఆట మీద అవగాహన వచ్చింది.


మ్యాచ్ మళ్ళీ మొదలైంది. స్టిచ్ మరో విన్నెర్ బాదాడు. నేను ఆనందంతో గంతులేశాను. ఇంతలో నా పాలిటి విలన్ మురళీబాబు వచ్చాడు. అయితే నా పన్నాగం ఫలించి ఆయన నన్ను, నాన్నని డిస్టర్బ్ చేయలేదు. 7-6 తో స్టిచ్ రెండో సెట్ గెలిచాడు. నా ఆనందానికి అవధులు లేవు. మరి స్టిచ్ నాకు ఎందుకు నచ్చాడో తెలీదు. బహుశః గెలుస్తున్నాడని కాబోలు. అంత చిన్న వయసులోనే "ఎవరికైనా గెలిచే వారే నచ్చుతారు".

ఇంతలో నాకు నిద్ర టైమయింది. నేను మంచమెక్కాను. కానీ నాకు నిద్రలోనూ నా హీరో ఆలోచనలే. మధ్యలో లేచి "నాన్నా! ఎవరు గెలిచారు?" అన్నాను.

"రెండు రౌండ్లు స్టిచ్చే గెలిచాడు. వాడే గెలుస్తాడులే."

తెల్లారింది. పేపెర్ వచ్చింది. నేను అందరికన్నా ముందే లేచి కూచుని అందరికన్నా ముందే పేపెర్ తీసుకుని న్యూస్ చూద్దును కదా... "బెకెర్ బోల్తా". అది ఆంద్ర జ్యోతి.

మన పంథా: "గెలిచే వాడే మనిషి."

Note: నాన్నని డు డు అంటున్నాడు అనుకుంటున్నారా... మా నాన్న నన్ను జీవితంలో ఒకే ఒక్కసారి కొట్టాడు. కారణం... "సత్యమేవ జయతే" లో చెపుతాను. అంతదాకా సెలవ్.

(సశేషం)

NEXT BLOG IS: "OLYMPIC TENNIS".

About This Blog

"ఈ ప్రపంచంలో రెండు విషయాలే సత్యం. ఒకటి గెలవటం. రెండు ఓడిపోవటం. అంతే. మిగతా అంతా మాయే. ఎందుకంటే విజేతలని అందరూ జ్ఞాపకం ఉంచుకుంటారు. పరాజితులని అందరూ మర్చి పోతారు. అందుకే విజయం శాశ్వతం. విజేతే అమరత్వానికి అర్హుడు."

The stories of such Gr8 Champions is chronicled here

The Player

My photo
You are able to see (any) only one of my numerous sides. And I know I'm rational. So, it's better to trust me, rather than evaluating my actions.

  © Blogger templates Newspaper II by Ourblogtemplates.com 2008

Back to TOP