విజేతెప్పుడూ నా డల్
Sunday, July 13, 2008
ఎంత అందమైన వింబుల్డన్ ఇదీ. అద్భుతమైన టెన్నిస్, అర్హత కలిగిన విజేత, కోరుకున్న రిజల్ట్స్, కనివిందు చేసిన ఆటతీరూ... ఓహ్! వాట్ ఎ టోర్నీ?
ఇల్లు మారే హడావిడిలో ఉన్నా ఈ బ్లాగు గురించే ఆలోచింపచేయగల సత్తా ఈ వింబుల్డన్ సొంతం.
ఈసారి డయలోగ్: "ఎ సర్ఫేస్లో ఆడాము అన్నది ముఖ్యం కాదన్నయ్యా! అడ్జస్ట్ అయ్యామా లేదా?"
రాఫెల్ నాదల్ ఈ సారి ఈ డయలోగ్ కొట్టాడు. ఫెదరర్ దిమ్మ తిరిగేలా చేసిన సందర్భం అది.
"విజేతంటే గెలవడమే కాదు, ఓటమిని అంత తొందరగా అంగీకరించరు కూడా" అని ఫెదరర్ నిరూపించిన సందర్భం ఇది.
మరో వైపు విలియమ్స్ ఆల్ విలియమ్స్ ఫైనల్ తో పాటూ, డబుల్స్ లో కూడా నెగ్గి తమ పూర్వ వైభవాన్ని ప్రదర్శించిన సందర్భం ఇది. అయినా ఈ విషయాన్ని మరుగున పడ వేసింది మటుకూ జన్టిల్మేన్స్ సింగిల్స్ ఫైనల్. అందులో అంత ఏముందీ? నా చిన్నప్పటినుంచీ సింహం పెద్దపులీ తలబడుతుంటే చూడాలని కోరిక. ఒకసారి మా నాన్నని ఈ విషయమే అడిగి, ఏది గెలుస్తుంది అని అడిగాను. అప్పుడు తరువాత చెపుతాను అని ఊరుకున్నారు. ఈ మ్యాచ్ చూసిన తరువాత ఆయన "నీ ప్రశ్న కి ఇదే సమాధానం," అన్నారు. కానీ ఇందులో ఎవరు సింహం, ఎవరు పెద్దపులి అని నాకు సరికొత్త డౌట్ వచ్చింది. కానీ అత్యున్నత స్తాయి టెన్నిస్ ని రుచి చూడాలంటే ఈ మ్యాచ్ తప్పక చూడాల్సిందే.
నాదల్: ఈసారి హీరో నదలే. ఫెదేరెర్ని గత కొంత కాలం గా పీడకలలా వెంటాడుతున్న నాదల్, ఫెదరర్ కళాత్మకమైన ఆటని తన టాప్ స్పిన్ షాట్స్ తో గడగడ లాడించాడు. ఎ సర్ఫేస్ మీదైనా నేను ఆడగలనని నిరూపించుకున్నాడు.
ఫైనల్ కు ముందు కేవలం ఒక సెట్ ని మాత్రమే కోల్పోయిన నాదల్ ఫైనల్ లో మొదటి సెట్ లో తన ప్రతాపాన్ని చూపించాడు. తొందరలోనే బ్రేక్ సాధించినా 47 నిమిషాలపాటూ ఆడాల్సి రావటం ఫెదరర్ లోని పోరాట పటిమకు నిదర్శనం.
ఇక రెండో సెట్ లో నాదల్ ని ఫెదరర్ అదరగొట్టి ఆదిక్యమ్లోకి దూసుకుని పోయాడు. కానీ నాదల్ మరోలా ఆలోచించాడు. ఫెదరర్ నిరుటిలా పుంజుకున్నాడు. తనది కాని సర్ఫేస్ మీద నాదల్ పని అయిపోతున్నది అని అందరూ అనుకుంటుండగానే నాదల్ వింబుల్డన్ దయలోగ్ కొట్టాడు. మాటలతో కాదు. తన ఆటతో. అంటే రెండో సెట్ కూడా నాదల్ వశం.
myaach మొదలైనఅప్పటినుంచీ ఇప్పటి దాకా నేను ఇంట్లో లేను వింబుల్డన్ విలేజ్ మొదటి బ్లాగు "ఎందుకు" వ్రాస్తున్నాను. ఇంతలో వర్షం వచ్చింది. వింబుల్డన్లో కాదు. మా ఊళ్ళో. నేను బ్లాగు రాసి ఇంటికి బయలుదేరే సరికి ఒకటే వాన. అయితే కరంట్ పోలేదు. దాంతో నేను ఫైనల్ కోసం వర్షం లోనే సైకిల్ మీద పరిగెత్తాను. తడిసి ముద్దై నేను ఇంటికి వెళ్ళేసరికి నాన్న "అక్కా వాన" అన్నారు. హ్హు హ్హు హ్హు. నేను ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి బోర్గ్, మెకెన్రో 1980 ఫైనల్ మ్యాచ్ వేస్తున్నారు. మధ్య మధ్య లో అసలు మ్యాచ్ (ఇప్పటి ఫైనల్) లోని ముఖ్య ఘట్టాలని వేసేసరికి "ఎలాంటి ఆటను మిస్ అయ్యాను" అనుకోకుండా ఉండలేక పోయాను.
నేను ఒక సారి అన్నం తిని లేచే సరికి మ్యాచ్ మళ్ళీ మొదలైంది. 6-4, 6-4, 4-5. నాదల్ వైపు నుంచీ స్కోర్ అది. నేను టెన్షన్ తో చూస్తుందా గానే కరంట్ ఆఫ్.
ఫెదరర్: ఫెదరర్ మోములో నవ్వు మాయమైంది. నాదల్ హుషారు గా ఉన్నాడు. నాదల్ మధ్యలో క్రింద పడ్డాడని, తన పని అయిపోయిందని అనుకున్నానని, నాన్న అన్నారు.
విజేతలెప్పుడూ అందరిలా ఆలోచించరు కదా! ఫెదరర్ అట్టాక్ మొదలెట్టాడు. నాదల్ ఆటలో సమస్య ఏమిటంటే తన షాట్లు ఫెదరర్ తో పోలిస్తే ఒకింత స్లో గా ఉంటాయి. బంతులు స్పిన్ అవుతూ వస్తాయి. వింబుల్డన్ గ్రాస్లో బంతికి అంత పట్టు చిక్కదు. ఈలోగా ఫెదరర్ కోర్ట్ కవర్ చేయ గలడు. సరిగ్గా ఈ సూత్రాన్నే ప్రయోగించి నాదల్ మనసులో అనుమానపు బాజాలని నాటాడు. సాధారణం గా వర్షం వల్ల బ్రేక్ వస్తే వెనుక బడిన ఆటగాళ్ళు పున్జుకుంటారు. (2001 లో ఇవానిసెవిచ్ హెన్మన్ ఆట గుర్తుందా? లేక పాయినా పర్లేదు. నేను తరువాత గుర్తు తెప్పిస్తాను). బ్రేక్ సమయంలో నాదల్ తను మరి కాసేపట్లో వింబుల్డన్ ట్రోఫీని పట్టుకున్తానని డిసైడ్ అయ్యి ఉంటాడు. కళ్ళ ముందు కప్ తో తను కనిపించి ఉంటాడు. అదే ఎప్పుడూ ప్రమాదం. పని చేస్తున్నప్పుడు ఫలితం గురించి ఆలోచించ కూడదని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు కదా! నాదల్ లో ఒక రకమయిన ఉద్వేగం కలిగింది. రాఫా గాడు వింబుల్డన్ విజేత. అంతే.
"గెలిచామా లేదా అని కాదన్నయ్యా! 100 పెర్సెంట్ ఇచ్చామాలేదా" అంటూ ఫెదరర్ ఆడుకున్నాడు. సెట్ టై బెర్క్ కి దారి తీసింది. టై బ్రేక్ లో నాదల్ పోరాడటానికి ప్రయత్నం చేసినాఫెదరర్ వకాశం ఇవ్వ లేదు. టై బ్రేక్ లో 5-౩ వద్ద పాయింట్ అద్భుతం. ఏస్ తో సెట్ని గెలుచుకున్నాడు.
ఇంట్లో అందరూ నిద్ర పోతున్నారు. నాన్న కూడా. లేట్ అయింది కదా!
నాకు నాదల్ మీద కోపం వచ్చింది. నాలుగో సెట్లో ఫెదరర్ ఊపు ఇంకా పెరిగింది. నడక లో హుషారు కనబడుతున్నది. నాకేమో మండుతున్నది. నేను నాదల్ ని తిట్టుకున్టున్డగానే సెట్ టై బ్రేక్ లోకి వెళ్ళింది. అందులో ఈ సారి నాదల్ ఆధిక్యం 5-2. మళ్ళీ నాదల్ వత్తిడికి గురి అయ్యాడు. రా గాడు వింబుల్డన్ విజేత సీన్ కళ్ళ ముందు మెదిలింది. అంతే. మనకు తెలిసిందేగా.
నేను మ్యాచ్ ని తక్కువ సౌండ్ తో చూస్తున్నాను. అక్కడ నాదల్ సెర్వింగ్ ఫర్ ది మ్యాచ్ అనగానే సౌండ్ కొంచం పెంచాను. ఫెదరర్ అదరి పోయే షాట్. ఇంక నాకు సెంటిమెంట్ పట్టుకుంది. వెంటనే సౌండ్ తగ్గించాను. ఈ సారి మ్యాచ్ పాయింట్. మళ్ళీ సౌండ్ పెంచాను. మళ్ళీ ఫెదరర్ పక్షమే. సౌండ్ డౌన్. మూడోసారీ ఇదే పరిస్థితి. ఏదయితే అది అయిందని సౌండ్ పెంచాను. ఇక పో ఫెదరర్ నభూతో అనే లాంటి బ్యాక్ హ్యాండ్ షాట్ తో సెట్ గెలుచుకున్నాడు. "చచ్చినోడా, వెధవా, ముండా, శుంఠా... అంటూ నాదల్ ని తిట్టుకున్నాను. స్లోర్ ఐదవ సెట్లో 2-2.
మళ్ళీ వర్షం పట్టుకుంది. నేను తట్టుకోలేక టీవీ ఆఫ్ చేసి పడుకున్నాను. నిద్రలో అంతా ఫెదరర్-నాదల్ ఆటే. మంచి మంచ్ పాయింట్ లన్నీ కలలోనే. నేను దొర్లుతున్నాను. "లే చూద్దాం," అంటూ ఫెదరర్ తట్టి పిలిచాడు. కళ్లు తెరిస్తే నాన్న. అప్పుడు టైం 1:37. స్కోర్ ఫైవ్ ఆల్. ఇంక అక్కడ నుంచీ నేనూ నాన్నా ఆ కబుర్లూ, ఈ కబుర్లూ చెప్పుకుంటూ మ్యాచ్ ని చూడటమే. పాత విషయాలు కొత్త విషయాలూ అన్నీ మాటలలోనే. ఇంతలో సెవెనాల్. ఫెదరర్ సర్వ్ ని నాదల్ బ్రేక్ చేసాడు. నేను సౌండ్ పెంచుదామనుకున్నా సెంటిమెంట్ గుర్తు వచ్చి పెంచకుండా మంచానికి అతుక్కు పోయాను. డ్యూస్ దాటి నాదల్ గెలవంగానే చూడాలీ నా మొహం thousand watts.
వింబుల్డన్ సామెత: "ప్రతి ఫెదెరెర్కీ ఒక నాదల్ వస్తాడు."
గతనుభావలనుంచీ నేర్చుకున్న పాఠాలని ఉపయోగించుకున్న నాదల్ గెలిచాడు.
శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు, "कर्मण्ये वाधि कारस्ते माफलेशु कदाचन!" పని చెయ్యటమే మన విధి. ఫలితం భగవానుడే చూసుకుంటాడు.
అందుకే మ్యాచ్ మధ్యలో ఒత్తిడికి గురి అవుతుంటారు, అనుభవం లేని వారు. నాదల్ కి వింబుల్డన్ గెలిచిన అనుభవం లేదు. అందుకే మొదటి మ్యాచ్ పాయింట్ అప్పుడు అలా.
మన పంథా: कर्मण्ये वाधि कारस्ते माफलेशु कदाचन
(సశేషం)