గెలిచే వాడే మనిషి - 2
Thursday, October 9, 2008
అబ్బ! ఈ పేరు గురించైతే ఈ మధ్యనే నాకు గంటసేపు తలంటి పోయటం జరిగింది. అదెలాగో మీకు త్వరలోనే తెలియవచ్చు. కానీ నేనే గెలిచాను. :-)) హ హ హ.
సరే విషయానికి వద్దాం. ఎక్కడ ముగించాం? అంతే దెబ్బకు నేను మైకేల్ స్టిచ్ కి అభిమానిని అయిపోయాను. ఎక్కడికెళ్ళినా నేను స్టిచ్ మంత్రమే. ఐతే అది కొంత కాలమే! తరువాత మనకి 'మహాకాళాన్ని మట్టుపెట్టిన ఇవాన్' దొరికాడు. వాడు టెన్నిస్ ఆటగాడు కాదు. (ఆ స్టోరీ వేరే చెప్తాను). కానీ నా మీద మైకేల్ స్టిచ్ వేసిన ఎఫ్ఫెక్ట్ అంతా ఇంతా కాదు. ఎక్కడో ఔట్ సైదర్ అయిన తను బెకేర్ అంతటి మొనగాడి మీద గెలవటం? గ్రేట్. ఎన్ని గట్స్ ఉండాలి? అందులోనూ మూడే మూడు సెట్ లలో గెలవటం?
నేను బడికి (కొత్త బడి. నేను పది క్లాసులని ఏడు బళ్ళలో చదివాను. బళ్లంటే ఎద్దు బండీలు కాదు. ఇస్కూలు బడి అన్న మాట. సారీ తమ్ముడి మాట.) వెళ్ళగానే శర్మా మాస్టరు మీ నాన్న గారి పరువు నిలబెట్టాలంటే మొదటి రాంకు రావాలని వార్నింగ్ ఇచ్చాడు. నాకేమో ఆయనంటే చచ్చేంత భయం. అస్సదురు మొదటి పిల్ల ఎవరా? (ఖచ్చితంగా నాకు అమ్మాయిలకే మొదటి రాంకు వస్తుందని నమ్మకం. ఎందుకంటే ఆ రాంకు విషయం లో అమ్మాయిలతోనే ఎక్కువ పోటీ పడింది) అని వెతుకులాట మొదలెట్టాను. అబ్బాగా చదివే అమ్మాయి పేరు ఐశ్వర్య అని కర్తవ్యం విజయశాంతి లెవెల్లో నాకు సుబ్రహ్మణ్యం సారు (శర్మ గారి అన్నయ్య) చెప్పారు. మొదటి రాంకు రాకుంటే తాట తీస్తానన్న శర్మా మాస్టరు వార్నింగు, సుబ్రహ్మణ్యం గారి కర్తవ్య బోధనా కలిసి నన్ను ఇరకాటంలో పడేశాయి. ఇంతలో చిన్నమామయ్య పెళ్లి కావడంతో వెళ్లి వచ్చాను. అదో పది రోజులు రక్షించింది.
ఈ గొడవ ఎట్టా తీరునా అనుకుంటుంటే ఇదో ఇలా స్టిచ్చి అనగా కొండ చిలివ గెలిచాడు. వాడేదో నెంబరు వానను ఆటగాడనుకుంటే... బెకేర్ కి ఉన్న చరిత్ర లేదని నాన్న చెప్పాడు. అద్గదీ అప్పుడే నాకూ ఒక ధైర్యం వచ్చింది. బెకేర్ లాంటి ఆటగాడినే స్టిచ్చి ఓడించగా లేంది మనకప్ఫలానా కర్తవ్యం ఐశ్వర్య ఒక లెక్కా అనుకుంటూ బరిలోకి దూకాం. చూశారా చిన్న వయసులోనే గెలుపంటే ఎంత ప్యాషనో! ఎవరికుండదు చెప్పండి?
"When odds are against you, you have to prove yourself to others. But when the odds are in favor of you, you have to prove only to yourself. But I don't prove to others. Because I never felt yhe odds are against me." - Pete Sampras.
వింబుల్డన్ సినిమా టైటిల్: గెలుపు - దీనికి రుచెక్కువ.
మరో విషయం. ఇదే కాదు. చాలా ఉదంతాలు చెప్పాలి. మొన్నీ మధ్య యూఎస్ ఓపెన్ గెలిచే రోజుల్లో FedEx మొహం చూశారా? ఒక రకమైన కసి. ప్రతి పాయింట్ నూ కొండని పిండి చేసేటంత కసి తో ఆడాడు. ఎందుకు? పాపం ఈ సంవత్సరం మొదట్లో ఉదార సంబంధమైన వ్యాధితో తను బాధ పడ్డాడు. గత సీజన్ ధాటికి అలిసిపోయాడు. మూడోసారి ఫ్రెంచ్ మిస్సయే సరికి కొంచం డీలా పడ్డాడు. దానికి తోడు వింబుల్డన్లో రాఫా ఐదు సెట్లకి స్ట్రెచ్ చేయటం తనకు కొంచం ఇబ్బంది పెట్టే విషయం. మళ్ళీ యూఎస్ లో జొకోవిక్ స్కోరు చూస్తె తేలిక గానే ఓడినా, తనని కంగారు పెట్టాడు.
అందుకే ఈసారి తను అలసటగా సీజాన్ని మొదలెట్టాడు. అంతే మన విమర్శకులకి మేత దొరికింది. వీళ్ళకి పనేమీ ఉండదు.
వింబుల్డన్ సినిమా టైటిల్: విమర్శకులు - వీళ్ళకి మేత కావాలి.
ఎలాగెలగా? ఫెదెరెరు ఆట్టం లేదు. ఇక ఇతని పని అయిపోయింది. దీనికితోడు జొకోవిక్ Australian Open గెలవటం తోనే ఇక ఇతనే నెంబరు వన్ను అన్నారు. మధ్యలో రాఫా ఉన్నాడనే సంగతి మర్చిపోయి. "ఇక నేనే నెంబరు వన్ను. కురుక్షేత్రమే ఎదురైతే.... మోసగాళ్ళకు మొసగాణ్ణీ రా" అంటూ వచ్చిన "నానీ" సినేమా గతే జొకోవిక్ కీ పట్టింది. రాఫా రెచ్చి పోయి నెంబరు వన్ను నేనే అని చెప్పలేదు, అయి చూపిస్తే... ఇక FedEx విషయానికి వద్దాం. ముందు Australian Open తర్వాత కొంత ఫాం కోల్పోయాడనేది నిజమే. జనానికి కావాల్సింది అదేగా. (నాక్కావాల్సిందీ అదే. విషయం తరువాత టపాల్లో వస్తుంది). అంత మాత్రాన అతని పనైపోయినట్లేనా?
కొంత కాలం గడిచింది. విమర్శల జడివానలో తడిసి ముద్దయ్యినందువల్ల పడిశం పట్టిందో, లేక నిజంగానే అలసి పోయాడో ఏమో కానీ FedEx కొంచం డీలా పడ్డాడు. పైకి కాదు. దాంతో ఫ్రెంచ్ లో ఆటను ఆడాడు అదీ పెద్ద తేడాతో. మేత గాళ్ళకి ఇక టైము వచ్చింది. ఫెదరర్ శకం ముగిసినట్టేనా? అని ఊహాగానాలు మొదలెట్టారు. అందరి గొంతులూ బాగోవుగా! అందుకే పాటలు అంత హిట్ కాలేదు. అయినా వాళ్లు పాడిందే పాత్రా... అన్న చందాన రెచ్చి పోతూనే ఉన్నారు. వింబుల్డన్ లో ఓడగానే ఇక బహిరంగంగానే కచ్చేరీలు మొదలెట్టారు. దుబాయి స్టేజ్ షోలూ వగైరా వగైరాలూ.
వింబుల్డన్ సామెత: చాంపియన్లు నడుస్తుంటే విమర్శకులు మొరిగినట్టు.
ఒలింపిక్స్ లో పేస్ ని ఓడించి డబుల్స్ గెలవడమే కాదు. కావాలంటే ఏదయినా నేను చేయగలనని తనకు తానూ నిరూపించుకున్నాడు FedEx . చామ్పియన్లకి ఎవరికో నిరూపించుకునే పని ఉండదు. కేవలం తమకు మాత్రమె బాధ్యులు. ఈ విషయాన్ని సాంప్రాస్ బాగా చెప్పాడు. ఆ నమ్మకంతోనే యూఎస్ ఓపెన్ లో రెచ్చి పోయి ఆడాడు. ఆ కసి గురించి Olympic Tennis - 2 లో చెపుతాను. గెలిచేవాడే మనిషి ఇక్కడికి పూర్తయింది. నా ఈ టైటిల్ గురించి ప్రశ్నించిన రొమాంటిక్ కామెడీ హీరోయిన్ గారికి టైటిల్ ఎందుకు పెట్టానో అర్ధం అయి ఉంటుంది.
మన పంథా: Winning is a fashion. Victory is my passion.
కొస మెరుపు: నాకు స్టిచ్చి ఇన్స్పిరేషన్ తో మొదటి రాంకు వచ్చింది. ఆ మర్నాడే కుమారి పిన్ని నాకు ఆడ పిల్ల వేషం వేసి ఫోటో తీయించింది. చూశారా విధి ఎంత బలీయ మైనదో!
Next post is 'Champions are colorful'.