HAPPY BIRTHDAY MY DEAR SAMPRAS
Tuesday, August 11, 2009
I wish you a very Great and Happy year ahead for you.
Winners Paradize.
I wish you a very Great and Happy year ahead for you.
ROGER FEDERER
వింబుల్డన్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఫైనల్ లలో ఒకటిగా నిచిపోయే ఈ నాటి ఆటలో
5-7, 7-6, 7-6, 3-6, 16-14 తేడాతో విజేతగా ఆవిర్భవించి చరిత్రలోనే తిరుగులేని ఆటగాడిగా నిలిచిపోయాడు.
దీంతో పాటూ, మహిళల WILLIAMSDON (2009) లో సెరెనా డబుల్స్ కూడా గెలిచి తన ఆధిపత్యాన్ని చాటింది.
మనీష్ పాండే. ఎవరికీ అంతగా తెలియని పేరు ఇది. కానీ మహామహులకి సాధ్యం కానిది సాధించి, ముందుండి నడిపిస్తున్న తన కెప్టెన్, అనిల్ కుంబ్లేకి బహుమతిగా ఇచ్చాడు.
IPL లో ఇంతవరకూ ఏ భారత batsman కూడా సెంచరీ చేయలేదు. కానీ ఈ ఇరవై ఏళ్ళ కుర్రాడు సాధించి భారత్ తరఫున ఈ ఘనతని సాధించిన మొదటి ఆటగాడిగా చరిత్రకి ఎక్కాడు. అంతే కాదు, ఈ దఫాలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా కూడా రికార్డులకెక్కాడు.
కెవిన్ పీటర్సన్ ని కోట్లు పెట్టి కొన్నా సాధించని ఫలితం కుంబ్లే వల్ల సాధ్యం అయింది. జట్టు సభ్యుల్లో విజయ కాంక్ష రగిలించి, తానే ముందుండి నడిపించి మొత్తానికీ ఈ టపా మొదలెట్టే సమయానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ని సెమీస్ కి తీసుకుని వెళ్ళాడు.
ఈ విజయానికి సంబంధించిన ఘనతంతా అతనికే దక్కుతుందంటే అతిశయోక్తి కాదు.
సరైన ఫోటో దొరకటానికే చాలా సేపు పట్టిన ఈ కుర్రాడిలో ఎంత ధైర్యాన్ని నూరిపోసి నమ్మకాన్ని రగిలించి ఓపెనర్‍గా పంపి ఉంటాడు కుంబ్లే!
Captain cum Coach గా రాజస్తాన్ జట్టుని షేన్ వార్న్ ఎంత స్పూర్తి దాయకంగా నడిపించాడో అంతకన్నా చక్కగా కుంబ్లే బెంగళూరు జట్టుని విజయవిహారం చేయించాడు. షేన్ తానే అంతా అయి, తాను లేకుంటే జట్టు లేదనే భావాన్ని కలిగిస్తే (అందుకే ఈ సారి వాళ్ళు వెనుక పడ్డారు) అన్నీ తానే అయి, అన్ని చోట్లా తానే ఉన్నా, ఆటగాళ్ళని ఎక్కడా తన టవరింగ్ పర్సనాలిటీ తో డామినేట్ చేయకుండా వాళ్ళ ఇండివిడ్యువల్ నేచర్ దెబ్బ తినకుండా జాగ్రత్త వహించటమే కాకుండా వయసు కాదు, ఆ వ్యక్తి దీక్షా దక్షతలు ముఖ్యం అని నిరూపించాడు.
సరిగ్గా ఆరు నెలల క్రితం captaincy నుంచే కాదు, ఆటగానిగానే తప్పుకోవాలని చాలా మంది విమర్శకులు సూచించినా, తనదైన శైలిలో అప్పుడే వెళ్ళిపోయాడా అనే రీతిలో రిటైర్ అయిన కుంబ్లే, అప్పుడే అయిపొయిందా అని పించేంత వేగంతో ముగిసే ట్వెంటీ20 క్రికెట్‍లో ఆటగానిగానే కాదు captaincy బరువు బాధ్యతలను కూడా మోస్తూ తన సత్తాని నిరీపించుకున్నాడు.
అలాంటి కుంబ్లేకి ఈ సెంచరీ సెమీఫైనల్‍కి ముందు లభించిన గొప్ప బహుమతి. ఈ విధంగా తమ నాయకుని ఋణాన్ని మనీష్ పాండే తీర్చుకున్నాడు.
ONLY MASTERS THAT MATTER, WHO CREATE WONDERS. అన్న వింబుల్డన్ విలేజ్ సంప్రదాయాన్ని అనుసరించి ఈ విజేతల స్వర్గధామానికి ఆహ్వానిస్తున్నాను. (ఇంకా వ్రాయాలి)
గీతాచార్య
ఈ మధ్యే స్పెయిన్ లో జరిగిన ఒక టోర్నీ లో Roger Federer, Rafael Nadal మీద గెలిచాడు. ఎంతైనా తనూ ఒక చాంపియనే కదా. విజేతలెప్పుడూ ఓటమిని సహించరు. అందుకే ఈ సారి French Open లో Rafa గెలిచి మళ్ళా లెక్క సరిజేస్తాడులే. నో ప్రాబ్లం రాఫా ఫ
ఆనందం. సంతోషం. ఆనందోద్వేగం. Ecstacy. Joyousness. ఇంకా ఇంకా చాలా పదాలు. ఎన్నైతే మాత్రం ఏముంది? నా ముందు. నా జీవితం ముందు.
అసలు జీవితం అంటే ఏమిటి? సంతోషమే కదా. Life is a celebration.
You may ask, "how can you say that 'Life is a celebration'?"
I can quickly answer. The only answer is...
Look at the Williams Sisters.
అవును. అంతకు మునుపు టెన్నిస్ అంటే అదో ఆట. కాసేపలా సరదాగా గడుపుతూ, ఏదో కాసింత exercise కోసం ఆడే ఆట. మన జనాలకి. అదో status symbol. డబ్బున్న వాళ్ళకే అది స్వంతం అనే ఒక ఫీలింగ్. చాంపియన్లూ ఉన్నారు. విజేతలూ ఉన్నారు.
చాలా సీరియస్ గా తీసుకుని ఆడే వాళ్ళూ ఉన్నారు, తేలికగా తీసుకుని ఆడేవాళ్ళూ ఉన్నారు. Ladies-Ladies, Gentlemen-Gentlemen singles, Ladies-Ladies, Gentlemen-Gentlemen doubles, Mixed doubles. అంతే. ఆటలో విభజనలు. అదంతా గతం. మరిప్పుడు. అదేమీ ధనవంతుల క్రీడ కాదు. ఎవరైనా ఆడగలరు. అదేమీ సీరియస్ బిజినెస్ కాదు. అదొక fun. ఎలాంటి fun? చాలా సీరియస్ fun.
నా మాటల్లో తేడా ఏమన్నా ఉందా? హహహ. తేడా నా మాటల్లో కాదు. సెరీనా విలియమ్స్ లో ఉంది. ఎలాంటి తేడా?
పైన చెప్పిన తరహా పోటీలు కాదు. సెరీనా వర్సెస్ Ladies and Gentlemen. అనేటంతటి తేడా.
హాయ్ సెరీనా! ఎలా ఉన్నావ్? అయినా అడిగేదేంటి? రోజూ చూస్తూనే ఉన్నాగా.
చాలా చక్కగా అది గెలుస్తూనే ఉన్నావుగా! ఇవాళ అక్కతో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ ఫైనల్ గెల్చి మాంచి హుషారుగా ఉన్నావు. ఆస్ట్రేలియా ఎండలు చంపేస్తున్నా నువ్వు నీ ప్రతాపాన్ని ఆ ప్రచండ భానుడికి చూపెట్టి రేపు జరిగే ఫైనల్ లో గెలు. అక్క విమ్బుల్డన్ చూసుకుంటుంది.
శుభాకాంక్షలతో...
తమ్ముడు.
చూడండి మా ఫ్యామిలీ.
----------------------------------------------------------------------------
వీనస్, సెరీనా ఇద్దరూ ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ గెలిచారు. అద్భుతమైన ఆట తీరు కనబరిచారట. అమ్మ చెప్పింది. హైలైట్స్ చూసి వ్రాయాలి. 6-3,6-3 score తో దానియేలా హన్తుకోవ, ఐ సుగియామా మీద విజయం సాధించారు.
----------------------------------------------------------------------------
5 out of 7 to Serena's victory.
© Blogger templates Newspaper II by Ourblogtemplates.com 2008
Back to TOP