'Man'ish పాండే సెంచరీ కుంబ్లేకి బహుమతి
Thursday, May 21, 2009
మనీష్ పాండే. ఎవరికీ అంతగా తెలియని పేరు ఇది. కానీ మహామహులకి సాధ్యం కానిది సాధించి, ముందుండి నడిపిస్తున్న తన కెప్టెన్, అనిల్ కుంబ్లేకి బహుమతిగా ఇచ్చాడు.
IPL లో ఇంతవరకూ ఏ భారత batsman కూడా సెంచరీ చేయలేదు. కానీ ఈ ఇరవై ఏళ్ళ కుర్రాడు సాధించి భారత్ తరఫున ఈ ఘనతని సాధించిన మొదటి ఆటగాడిగా చరిత్రకి ఎక్కాడు. అంతే కాదు, ఈ దఫాలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా కూడా రికార్డులకెక్కాడు.
కెవిన్ పీటర్సన్ ని కోట్లు పెట్టి కొన్నా సాధించని ఫలితం కుంబ్లే వల్ల సాధ్యం అయింది. జట్టు సభ్యుల్లో విజయ కాంక్ష రగిలించి, తానే ముందుండి నడిపించి మొత్తానికీ ఈ టపా మొదలెట్టే సమయానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ని సెమీస్ కి తీసుకుని వెళ్ళాడు.
ఈ విజయానికి సంబంధించిన ఘనతంతా అతనికే దక్కుతుందంటే అతిశయోక్తి కాదు.
సరైన ఫోటో దొరకటానికే చాలా సేపు పట్టిన ఈ కుర్రాడిలో ఎంత ధైర్యాన్ని నూరిపోసి నమ్మకాన్ని రగిలించి ఓపెనర్‍గా పంపి ఉంటాడు కుంబ్లే!
Captain cum Coach గా రాజస్తాన్ జట్టుని షేన్ వార్న్ ఎంత స్పూర్తి దాయకంగా నడిపించాడో అంతకన్నా చక్కగా కుంబ్లే బెంగళూరు జట్టుని విజయవిహారం చేయించాడు. షేన్ తానే అంతా అయి, తాను లేకుంటే జట్టు లేదనే భావాన్ని కలిగిస్తే (అందుకే ఈ సారి వాళ్ళు వెనుక పడ్డారు) అన్నీ తానే అయి, అన్ని చోట్లా తానే ఉన్నా, ఆటగాళ్ళని ఎక్కడా తన టవరింగ్ పర్సనాలిటీ తో డామినేట్ చేయకుండా వాళ్ళ ఇండివిడ్యువల్ నేచర్ దెబ్బ తినకుండా జాగ్రత్త వహించటమే కాకుండా వయసు కాదు, ఆ వ్యక్తి దీక్షా దక్షతలు ముఖ్యం అని నిరూపించాడు.
సరిగ్గా ఆరు నెలల క్రితం captaincy నుంచే కాదు, ఆటగానిగానే తప్పుకోవాలని చాలా మంది విమర్శకులు సూచించినా, తనదైన శైలిలో అప్పుడే వెళ్ళిపోయాడా అనే రీతిలో రిటైర్ అయిన కుంబ్లే, అప్పుడే అయిపొయిందా అని పించేంత వేగంతో ముగిసే ట్వెంటీ20 క్రికెట్‍లో ఆటగానిగానే కాదు captaincy బరువు బాధ్యతలను కూడా మోస్తూ తన సత్తాని నిరీపించుకున్నాడు.
అలాంటి కుంబ్లేకి ఈ సెంచరీ సెమీఫైనల్‍కి ముందు లభించిన గొప్ప బహుమతి. ఈ విధంగా తమ నాయకుని ఋణాన్ని మనీష్ పాండే తీర్చుకున్నాడు.
ONLY MASTERS THAT MATTER, WHO CREATE WONDERS. అన్న వింబుల్డన్ విలేజ్ సంప్రదాయాన్ని అనుసరించి ఈ విజేతల స్వర్గధామానికి ఆహ్వానిస్తున్నాను. (ఇంకా వ్రాయాలి)
గీతాచార్య
ఈ మధ్యే స్పెయిన్ లో జరిగిన ఒక టోర్నీ లో Roger Federer, Rafael Nadal మీద గెలిచాడు. ఎంతైనా తనూ ఒక చాంపియనే కదా. విజేతలెప్పుడూ ఓటమిని సహించరు. అందుకే ఈ సారి French Open లో Rafa గెలిచి మళ్ళా లెక్క సరిజేస్తాడులే. నో ప్రాబ్లం రాఫా ఫ