మోనికా నన్ను మన్నించు సెలెస్.
Sunday, March 29, 2009
"మోనికా... నువ్వు ఆడేటప్పుడు ఒక పోరాట యోదురాలివి. గెలవటం తప్ప మరేమీ పట్టనట్టుంటావు. పోరాట పటిమకీ, ధైర్యానికీ మారు పేరు గా చెప్పుకోబడే నువ్వు నీ మీద జరిగిన దాడి తరువాత ఇరవైఎనిమిది నెలలు gap తీసుకోవటం ఆశ్చర్యంగా ఉంది. ఇది ఒక paradox కాదా?"
ప్రశ్నలో ఏమీ లేదు. కాస్త పొగడ్త. ఒక చిన్న డౌట్. ఎప్పుడూ చాంపియన్లని అడిగే లాంటి ప్రశ్నే. కానీ సమాధానమే నా మనస్సుని చివుక్కు మనిపించింది. అంతో ఇంతో కాదు. అప్పటికప్పుడు ఈ టపాని వ్రాసేలా.
ఆ సమాధానం ఏమైనా ఒక గొప్ప quotationaa అంటే అదేమీ కాదు. అలా అని ఏదో నార్మల్ గా చెప్పబడినదా అంటే అదీ కాదు.
వింబుల్డన్ సామెత: స్టెఫీనభిమానించరా అంటే సెలెస్సుని పొడిచాట్ట.
"గెలవటం తప్ప వేరేమీ తెలియని నేను, జీవితం అంటే అదో ఆట, సరదా, అని తప్ప వేరే భావన లేని నేను... అప్పటికి పందొమ్మిది ఏళ్ల దానిని. అలాంటి సంఘటనా అంతకు మునుపూ, ఆ తరువాతా జరుగలేదు. అది ఒక అసాధారణమైన సంఘటన. I had to deal with a lot of issues. దురదృష్ట వశాత్తూ ఆ సంఘటన నా జీవితం లోని అత్యున్నత దశని కరిగించేసింది. అది నేను కలలో సహితం ఊహించని సంఘటన. కానీ ఒకసారి నేను మళ్ళా కోర్టులో అడుగుబెట్టాలని అనుకున్నాక మళ్ళా నేను వెనుతిరిగి ఆలోచించలేదు. నేను టెన్నిస్ రాకెట్ పట్టుకునేటప్పటికి నాకు ఆరేళ్ళు. అంతే. నేను ఆడిందే ఆ ఆటంటే నాకు ప్రాణం కనుక. ఆ భయానక సంఘటన తరువాత నేను మళ్ళీ కోర్టులో అడుగు పెట్టిందే ఆట మీదున్న వెర్రి ప్రేమతోనే. ఇప్పటికీ ఆడుతున్నదీ అంచేతనే. ఆలస్యం అనేది నన్ను నేను రికవర్ చేసుకునే ప్రయత్నంలో జరిగింది. ఆ దాడి శారీరకంగా జరిగింది కాదు. మానసికంగా ఇప్పటికీ వెన్నాడుతూనే ఉంది. ఎవరు నన్ను కలసిన అడిగినా దాని దగ్గరకే మాటలను తీసుకుని వెళ్తారు. సెలెస్ జీవితం... దాడికి ముందూ వెనుకా."
"ఊహించని సంఘటన" తెల్లవారగానే... నిద్ర లేచి, చక్కగా రెడీ అయ్యి కాలేజీకి బయలుదేరి దారిలో స్నేహితురాలిని కలసి, ఆహ్లాదకరమైన వాతావరణం లో campus లో అడుగుబెట్టి, చివరి పరీక్షకి సిద్ధమై.... వైవాకి తయారవుతున్న 'శ్రీలక్ష్మి' ఊహించిందా తనని ఒక ఉన్మాది తెగనరుకుతాడని?
సరదాగా అలా బీచి ఒడ్డున కూచుని పిల్లలతో, సఖులతో, స్నేహితులతో, ఆ సాగర సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్న ఆ వేలాది మంది మాత్రం ఊహించగాలిగారా తమని సునామీ బలిగొంటుందని?
ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉండి తనకు పాదాభివందనం చేయబూనిన స్త్రీ ఒక మానవ బాంబనీ, ఆమె వల్లే క్షణ కాలంలో తన పంచ ప్రాణాలూ పంచ భూతాలలో కలవ బోతున్నాయనీ... రాజీవ్ గాంధీ ఊహించగాలిగాడా?
వింబుల్డన్ వివేకం: ఒక దారి మూసుకునేది మరో దారి తెరచుకునేటందుకే. రాజీవ్ గాంధీ ఆ రోజు అలా ఊహించి ఉంటే ఈనాడు మనకి పీవీ లాంటి మహా మేధావి ప్రధాని అయ్యేవాడా? మన్మోహన్ లాంటి ఆర్ధిక మంత్రి లభించి ఉండేవాడా? మన దేశం లో ఆర్ధిక సంస్కరణలు జరిగి ఉండేవా?
సరదాగా అలా బీచి ఒడ్డున ఉన్న వారు ఊహించి ఉంటే ఈనాడు మనకి (మన భారతీయులకి)సునామీ గురించి తెలిసి ఉండేదా? దశావతారం లాంటి సినిమా వచ్చి ఉండేదా?
శ్రీలక్ష్మి లాంటి వారు అలా ఊహించి ఉంటే ఈనాడు మన మీడియాకి సెన్సేషనల్ న్యూసులు దొరికి ఉండేవా? మహిళా సంఘాల వారికి మంచి మేత దొరికేదా? మనలో ఉన్న పశుత్వం బయట పడేదా? ఒక్కసారి ఊహించండి. ఆరోజు సెలెస్ మీద ఆ దాడి జరగక పోయి ఉంటే... స్టెఫీ గ్రాఫ్ ఆటని మనం మరింత కాలం ఆస్వాదించి ఉండేవారమా?
కానీ... కానీ... ఒక ఆలోచన, నా చిన్నప్పుడు కలిగిన ఒక పైశాచికానందం నన్ను దహించివేసింది. అది తెలియని వయసు. ఇప్పుడు సత్యాన్వేషణ జరుపుతున్న వయసు.
వింబుల్డన్ సూక్తి: మనిషికీ పశువుకీ ఉన్న తేడా వివేచనా, విచక్షణా జ్ఞానం. తెలియని తనం నుండీ తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టే వరకూ మనిషి చేసే పయనమే జీవితం. చిన్నప్పుడు నాకు స్టెఫీ గ్రాఫ్ అంటే ఇష్టం. ఎందుకో తెలియదు. కానీ ఇష్టం. మొదటి సారి గెలవటం అంటే ఏంటో నాకు చూపిన స్టిచ్ లాగే అదే టైం లో ఒక్కరోజు ముందు అదే అనుభవాన్ని నాకు చూపించటం వల్ల కావచ్చు. కానీ దానికి ఒక logical base కానీ, rational perspective కానీ లేవు. స్టెఫీ రైవల్ ఐన సెలెస్ అంటే ఒకింత కచ్చగా ఉండేది. దానికీ ఏవిధమైనటువంటి కారణం లేదు.
అందుకే సెలెస్ చేతుల్లో 1992 French Open ఫైనల్లో స్టెఫీ ఓడినప్పుడు నాకు మంట పుట్టిపోయింది. సెలెస్ అంటే ఇంకా కచ్చ పెరిగి పోయింది. అది అలా అలా పెరిగి పెరిగి తన మీద ఆ దాడి జరిగినప్పుడు నేను అనుకుందొకటే. "హమ్మయ్య. ఇక స్టెఫీని ఎవరూ ఓడించలేరు."
అదప్పుడు నాకు అర్ధం కాలేదు కానీ ఎందుకో నాకు ఒకరకమైన reproach ఏర్పడింది. అలా ఎలా అనుకున్నానా అని. అలా అనుకోవటానికి కారణం నాకు స్టెఫీ మీద ఉన్న అభిమానమే. అంటే అభిమానం ఒకరి మీద ఉంటే వేరే వాళ్ల మీద కచ్చింపు ఉండాలా? అప్పటికి, ఆ క్షణంలో నాకు తెలియలేదు. కానీ ఒకటి అనుకున్నాను. స్టెఫీ అంటే నాకు ఎందుకు అభిమానమో సరిగా తెలియక పోవటం వల్లే ఈ రకమైన అమానుషమైన ఫీలింగ్ నాకు కలిగింది. అప్పుడనుకున్నా అభిమానం ఉండాలంటే దానికి ఒకరకమైన ప్రాతిపదిక ఉండాలని. లేకుంటే.... ఇలాంటి దురభిమానంగా మారే ప్రమాదం ఉంటుందని.
అప్పుడే నిర్ణయం తీసుకున్నాను. ప్రతి దానికీ ఒక rational ప్రాతిపదిక ఉండాలని. నేను చేసే ప్రతీ పనికీ ఒక లక్ష్యం ఉండాలని. హేతువుకి అందని ఎ పనినీ చేయరాదనీ. ఈ సంఘటనే జరిగి ఉండకపోతే... నాకు రేషనల్ వ్యూ యొక్క ఆలోచనే వచ్చేది కాదేమో?
అలా rational గా ఉండందే నాకూ ఆ ఉన్మాదులకీ ఏ తేడా ఉండదని.
అదృష్టం. చాలా చిన్న వయసులోనే ఇవన్నీ జరిగాయి. లేక పోతేఎలా ఉండేదో.
********************************************************************
ఒక మనిషి గొప్పతనం గురించి తెలియాలంటే... వారికి సరైన రైవల్ ఉండాలి. అర్జునుడికి కర్ణుడు లా. భీముడికి దుర్యోధనుడిలా. లేందే ఉపయోగం ఏది?
సెలెస్ వచ్చి స్టెఫీని చాలెంజ్ చేయబట్టే... స్టెఫీ తన ఆటతీరుని మెరుగు పరుచుకుంది. రాఫెల్ నాదల్ ఉండబట్టే ఫెదరర్ సామర్ధ్యానికి ఒక బెంచ్ మార్క్ ఏర్పడింది. ఫెదరర్ ఉండగానే గెల్చాడు కాబట్టే నాదల్ వింబుల్డన్ టైటిల్ కి సార్ధకత. ఫెదరర్ లేని సమయం లో గెలిచి ఉంటే అ విజయానికి ఇంత మధురిమ ఉండదు. అందుకే
వింబుల్డన్ మోటో: THE CODE OF COMPETENCE IS THE ONLY SYSTEM OF MORALITY THAT'S ON A GOLD STANDARD.
అసలు పోటీ లేనిదే మజా ఏముంటుంది? సెలెస్ ఆడలేదు కనుకే ఆ రెండేళ్ళూ స్టెఫీ ప్రస్తానం మీద కాస్త షేడ్ ఉంది. సెలెస్ ఉంటే ఎలా ఉండేదో అని ఒక ప్రశ్న మిగిలిపోయింది. అందుకే స్టెఫీ, సెలెస్ ల క్రీడాజీవితం విడదీయరానిది. వీరి ఇద్దరి గురించీ స్టెఫీ - సెలెస్ అన్న సెక్షన్ క్రింద వ్రాసే నా టపాలలో చూడవచ్చు. అద్భుతమైన మ్యాచులూ, వీరి రైవల్రీ లో వచ్చిన మాటల తూటాలూ, కష్టాలూ కన్నీళ్ళూ, అలా సాగిన దశాబ్ద కాలం గురించీ...
మచ్చుకి ఈ వీడియొ చూడండి. వీరిద్దరి చివరి మ్యాచ్ అది.
http://www.youtube.com/watch?v=XuL_QGkTUjU&feature=related
మన పంథా: ONLY MASTERS THAT MATTER, WHO CREATES WONDERS.
పోటీపడలేక అసూయతో రగిలిపోయేవారూ, ఏమీ చేయలేక దొంగ దెబ్బతీసే వారూ కాదు.
Note: కాస్త ఎమోషన్లో ఉండి రాయటంతో ఎప్పటి లాగా హాస్య చెణుకులు వేయలేదు. నాకు కుదరలేదు కూడా. అయినా ఇది ఒక సీరియస్ తింగ్. దట్స్ ఆల్.
గీతాచార్య.